ఆహా.. అదిరిందిగా ఆ బ్యాక్..!

Last Updated on by

వాణిక‌పూర్.. పేరు గుర్తు రావ‌డానికి క‌చ్చితంగా కాస్త టైమ్ ప‌డుతుంది. ఆ లోపు నాని న‌టించిన ఆహా క‌ళ్యాణం గుర్తు చేసుకోండి. ఇప్పుడంటే మ‌నోడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి నాని సినిమాలో న‌టిస్తే దెబ్బ‌కు స్టార్స్ అయిపోతారు. కానీ అప్పుడు నాని ఇమేజ్ దారుణంగా ఉంది. ఫామ్ లో లేడు. అందుకే వాణిక‌పూర్ కూడా పెద్ద‌గా గుర్తు లేదు ప్రేక్ష‌కుల‌కు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టికీ త‌న జెండా ఎగ‌రేయాల‌ని చాలా ట్రై చేస్తుంది వాణి క‌పూర్. ఈమెకు య‌శ్ రాజ్ సంస్థ అండ‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె న‌టించిన సినిమాల‌న్నీ ఆ బ్యాన‌ర్ లో చేసిన‌వే. ఇప్పుడు కూడా హృతిక్ రోష‌న్ కి జోడీగా బ్యాంగ్ బ్యాంగ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తోన్న సినిమాలో వాణి హీరోయిన్ గా ఎంపికైంది.

బాలీవుడ్ లోనూ వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. పైగా ఇక్క‌డ క‌ప్పుకుని ఉంటే ఇంట్లో కూర్చోవాల్సిందే అంటూ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది వాణి క‌పూర్. తాజాగా ఓ ఈవెంట్ లో అదిరిపోయే అందాల షో చేసింది వాణి. ప‌ర్ ఫెక్ట్ బ్యాక్ కు తోడు అదిరిపోయే ఫ్రంట్ చూపిస్తూ కెమెరాల‌కు ఫుల్లుగా ప‌ని క‌ల్పించింది. ఈ భామ అందాల దూకుడు చూసి అక్క‌డున్న వాళ్లంతా ఆహా.. అదిరిపోయిందిగా బ్యాక్ అనుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి ఈ అందాల వాణిని ఎవ‌రు వాడుకుంటారో..!

User Comments