నాని హీరోయిన్ కు య‌శ్ రాజ్ సంస్థ అండ‌

ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ను ప‌ల‌క‌రించ‌డం క‌ష్టం. కానీ చేసిన సినిమాల్లో 90 శాతం ఫ్లాపులుంటే ఆ హీరోయిన్ వైపు క‌నీసం చూడ‌రు కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ వాణిక‌పూర్ విష‌యంలో మాత్రం ఇది జ‌రగ‌డం లేదు. ఈ భామ కెరీర్ కు య‌శ్ రాజ్ సంస్థ అండ‌గా నిలుస్తుంది. వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇచ్చి మ‌రీ ప్రోత్స‌హిస్తుంది. ఇప్ప‌టికే ఈ సంస్థ‌లో మూడు సినిమాలు చేసిన వాణి.. ఇప్పుడు నాలుగో ఆఫ‌ర్ కూడా ద‌క్కించుకుంది.

టైగ‌ర్ ష్రాఫ్.. హృతిక్ రోష‌న్ హీరోలుగా బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తోన్న చిత్రంలో వాణిక‌పూర్ హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగులో ఆహాక‌ళ్యాణం సినిమాలో నానితో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా య‌శ్ రాజ్ సంస్థే. గ‌తేడాది వ‌చ్చిన బేఫిక్రే సినిమాలో నటించి.. అందాల ఆర‌బోత‌లో కొత్త ఉద్య‌మం తీసుకొచ్చింది వాణి. అందులో న‌టించింది అనేకంటే జీవించింది అనాలేమో..? ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తోనే జోడీ క‌ట్టే ఛాన్స్ వ‌చ్చింది. అస‌లే అవ‌కాశాల్లేని వాణిక‌పూర్ కు హృతిక్ రోష‌న్ ప‌క్క‌న ఛాన్స్ అంటే ఎడారిలో బిస్ల‌రి బాటిల్ దొరికిన‌ట్లే..!