చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్ర షూటింగ్ ప్రారంభం

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై ఇటీవల పూజాకార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. భారీ నటీనటవర్గం మరియు సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది.రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. “బాహుబలి” చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇంకా బోలెడన్ని ప్రత్యేక ఆకర్షణలు, విశేషాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో కళ్యాణ్ దేవ్ తోపాటు కీలక నటీనటులు పాల్గొననున్నారు” అన్నారు.
తారాగణం:
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి,  కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి.

User Comments