`రంగ‌స్థ‌లం` సీక్వెల్ స్టోరీనా?

Last Updated on by

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కాకినాడ కుర్రాడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో సుక్కూ రైటింగ్స్- మైత్రి మూవీమేక‌ర్స్ సినిమా హైద‌రాబాద్ నాన‌క్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభ‌మైంది. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కి బ్లెస్సింగ్స్ అందించారు. ఆయ‌న క్లాప్ కొట్టి సినిమాని ప్రారంభించ‌గా, అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర‌వింద్ స్క్రిప్టు ప్ర‌తుల్ని ద‌ర్శ‌కనిర్మాత‌లు బుచ్చిబాబు – సుకుమార్ ల‌కు అందించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -“సుకుమార్ రైటింగ్స్ అంటే యంగ్ స్ట‌ర్స్‌ని ప్రోత్స‌హిస్తుంది. ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం సుకుమార్ అల‌వాటు. మైత్రి సంస్థ‌లో వైష్ణ‌వ్ తేజ్ అవ‌కాశం అంటే అదృష్టం. మంచిత‌నం ఉన్న నిర్మాత‌లతో సినిమా చేస్తున్నాడు నా మేన‌ల్లుడు. ఇక ఈ సినిమాని ఒక ర‌స్టిక్ ల‌వ్ స్టోరితో తీస్తున్నారు. ర‌స్టిక్ అన‌గానే రంగ‌స్థ‌లం గుర్తొస్తుంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ట‌య్యిందో అంద‌రికీ తెలుసు. రంగ‌స్థ‌లం క‌థా చ‌ర్చ‌ల్లో బుచ్చిబాబు పాత్ర చాలా ఉంద‌ని సుకుమార్ అన్నారు. ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ కోసం ఈ క‌థ‌ను త‌యారు చేసేందుకు బుచ్చిబాబు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. బుచ్చిబాబు త‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్రేక్ష‌కుల మ‌న్న‌న పొందేలా ఈ క‌థ‌ను తెర‌పై తీర్చిదిద్ద‌గ‌ల‌డ‌ని ఆశిస్తున్నా. మ‌న‌సు పెట్టి ఈ క‌థ‌ను రాసుకున్నాడు. ప్రేక్ష‌కుల మ‌న్న‌న పొందుతాడు. నూత‌న ద‌ర్శ‌కుడిని మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. సుకుమార్ గొప్ప‌త‌నం గురించి చెప్పాలంటే.. అత‌డు మంచి క‌థ‌లు దొరికిన‌ప్పుడు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించి మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే గాక‌, యంగ్ స్ట‌ర్స్ మంచి క‌థ‌ల‌తో వ‌చ్చిన‌ప్పుడు ఎంక‌రేజ్ చేస్తాడు. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాలి“ అని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చెప్పిన దానిని బ‌ట్టి బుచ్చిబాబు ఈసారి రంగ‌స్థ‌లం సీక్వెల్ లాంటి క‌థ‌తో తీస్తున్నాడా? పంచెక‌ట్టులో సాయిధ‌ర‌మ్ ర‌గ్గ్ డ్ లుక్ వెన‌క మ్యాజిక్ అదేనా? మ‌త్స్య‌కారుడి క‌థ‌తో ఈ సినిమా తీస్తున్నాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments