వ‌క్క ంతం తొలి టార్గెట్ ప‌వ‌న్‌?

Last Updated on by

ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ఏ ద‌ర్శ‌కుడు అయినా కాస్తంత పెద్ద స్థాయికి ఎదిగాక‌, లేదా ఎదిగే క్ర‌మంలోనో క‌చ్ఛితంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని క‌ల‌గంటారు. ఇప్ప‌టికే ఆ క‌ల‌ను త్రివిక్ర‌మ్‌, పూరి, హ‌రీష్ శంక‌ర్ వంటి ద‌ర్శ‌కులు నెర‌వేర్చుకున్నారు. అయితే న‌వ‌త‌రంలో ఇంకా ఆ క‌ల నెర‌వేర్చుకునేందుకు కందిరీగ సంతోష్ ఎంతో ఆశ‌ప‌డి ఏళ్ల‌కు ఏళ్లు వేచి చూశాడు. చివ‌రికి అత‌డి దుర‌దృష్ట‌మో ఏమో ఆ క‌ల నెర‌వేర‌లేదు. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి రావ‌డంతో ఆ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది.

అయితే ప‌వ‌న్ జాబితాలో ఇంకా ఎంద‌రు ఉన్నారు? అంటే చాలా మందే ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవైపు అట్నుంచి త‌మిళ‌ద‌ర్శ‌కులు ఇటువైపు వ‌చ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమాలు తీయాల‌న్న క‌సితో ఉంటున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌న ద‌ర్శ‌కుల‌కు స్కోప్ కూడా త‌గ్గిపోయింది. ఇక‌పోతే .. ప‌వన్ ఇప్పుడు పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించి, సినీకెరీర్‌ని ప‌క్క‌న‌బెట్టేయ‌డంతో వేరే ఎవ‌రికీ ఆ ఒక్క ఛాన్స్ ద‌క్కించుకునే అదృష్టం లేకుండా పోయింది. అయితే ఇలా ఆ అదృష్టం కోల్పోయిన ద‌ర్శ‌కుల్లో `నా పేరు సూర్య‌` ఫేం వ‌క్క ంతం వంశీ కూడా ఉన్నారు. ఆ సంగ‌తి నా పేరు సూర్య థాంక్యూ ఇండియా మీట్‌లో ప‌వ‌న్ స్వ‌యంగా రివీల్ చేశారు. వ‌క్క ంతం ర‌చ‌యిత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. కొమ‌రం పులి టైమ్‌లోనే క‌థ చెప్పినా సినిమా చేయ‌లేక‌పోయామ‌ని వెల్ల‌డించారు. మొత్తానికి ఇక ప‌వర్‌స్టార్ రాజ‌కీయాల్లోకి పూర్తిగా వెళ్లిపోయారు కాబ‌ట్టి, ఇక ఆ కోరిక జాబితాలో ఉన్న మ‌న యువ‌ ద‌ర్శ‌కులెవ‌రికీ ఎప్ప‌టికీ నెర‌వేర‌దేమో!?

User Comments