వాల్మీకి మూవీ రివ్యూ

సినిమా: వాల్మీకి అలియాస్  గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌

నటీనటులు : వ‌రుణ్ తేజ్, అధ‌ర్వ‌, మృణాళిని త‌దిత‌రులు..

దర్శకత్వం: హ‌రీష్ శంక‌ర్

బ్యానర్: 14 రీల్స్ ప్ల‌స్

నిర్మాత: ర‌వి, న‌వీన్, సి.వి.మోహ‌న్

సంగీతం: మిక్కీ.జె.మేయ‌ర్

ముందు మాట:

తొలి నుంచి మెగా ఫ్యామిలీ హీరోల్లో ప్రయోగాల బాట‌లో వెళుతూ అంద‌రికీ స‌ర్ ప్రైజ్ ఇస్తున్నాడు వ‌రుణ్ తేజ్. ఎంచుకునే ప్ర‌తి స్క్రిప్టు వైవిధ్యంగా ఉండాల‌ని త‌పిస్తున్నాడు. అత‌డి ప్ర‌య‌త్నానికి అభిమానులున్నారు. అందుకే ఈసారి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి చిత్రంలో న‌టిస్తున్నాడు అన‌గానే ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది అన్న క్యూరియాసిటీ ఏర్ప‌డింది. టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్నారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ పాత్ర‌లో ర‌ఫ్ గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో వరుణ్‌ మైమ‌రిపించాడు. హ‌రీష్ కి ఇది కంబ్యాక్ మూవీ. మైత్రికి వ‌రుస ఫ్లాప్ ల‌ త‌ర్వాత చేస్తున్న మూవీ కావ‌డంతో చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే వాల్మీకి బోయ‌ల వివాదం వ‌ల్ల చివ‌రి నిమిషంలో ఈ సినిమా టైటిల్ ని `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌` గా మార్చారు. నేడు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. అస‌లు ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ ఎలా న‌టించాడు? కంటెంట్ ఆశించినంత ఉందా లేదా? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్‌:
చెడ్డ‌వాడైన‌ ఒక గ్యాంగ్ స్ట‌ర్ మంచి వాడిగా మారే క్ర‌మంలో ఏం జ‌రిగింది? అన్న‌దే సింగిల్ లైన్ స్టోరి.

కథనం అనాలిసిస్:

గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) పేరు మోసిన గ్యాంగ్ స్ట‌ర్. అత‌డిని ఎలాగైనా ద‌ర్శ‌కుడిగా త‌న డెబ్యూ సినిమాకి ఒప్పించాల‌ని అభిలాష్(అథర్వ) ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఫ్యామిలీతో ఏర్ప‌డిన స‌వాల్ ని నెగ్గేందుకు అభిలాష్ ప్ర‌య‌త్నాలు సాగుతాయి. ఒక నిజమైన గ్యాంగ్ స్ట‌ర్ కథతో సినిమా తీయాలని భావించి గద్దలకొండ గణేష్ ను ఫాలో అవుతుంటాడు. అయితే అత‌డి ప్ర‌య‌త్నాలు చివ‌రికి స‌క్సెస‌య్యాయా లేదా? అత‌డు ద‌ర్శ‌కుడ‌య్యాడా లేదా? గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ వాస్త‌వ జీవితం ఏమిటి? అత‌డు ఎవ‌రు? గ‌ణేష్‌ సినిమాలో న‌టించాడా లేదా? ఇందులో పూజా హెగ్డే పాత్ర ఏమిటి? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా మొద‌లైన అధ‌ర్వ‌.. గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ని క‌లిసిన‌ప్ప‌టి నుంచి స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ పాత్ర సినిమాలో హైలైట్. రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ న‌టించే ప్ర‌య‌త్నం చేశాడు. హరీష్ శంకర్ త‌న‌దైన మాస్ ప్రెజెంటేష‌న్ తో ఆక‌ట్టుకునే ఎటెంప్ట్ చేశాడు. అయితే ఇందులో అదిరిపోయే ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పుకునేందుకేమీ ఉండ‌దు. కేవ‌లం వ‌రుణ్ క్యారెక్ట‌రైజేషన్ తోనే ఫ‌స్టాఫ్ బండి న‌డిపించారు. బోర్ కొడుతుంది అనే టైమ్ లో డైలాగ్స్ తో కొంత‌వ‌ర‌కూ ట్రాక్ లోకి వ‌స్తుంది. బిట్లు బిట్లుగా కామెడీ ఆక‌ట్టుకుంది. ఈ క‌థ‌లోనే గ‌ద్ద‌ల కొండ బంధువు అయిన మృణాళినితో అధ‌ర్వ లవ్ స్టోరి క్యూట్ గా ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ వ‌రుణ్ పాత్ర‌తోనే న‌డిపించారు. అధ‌ర్వ న‌ట‌న డీసెంట్ అనిపిస్తుంది.

సెకండాఫ్ లో గ‌ద్ద‌ల కొండ‌ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్. అక్క‌డే రిట్రో డేస్ పూజా హెగ్డే తో ల‌వ్ స్టోరి సాగుతుంది. పూజా ఎంతో స‌హ‌జమైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఎల్లువొచ్చి గోదారమ్మా పాట‌లో పూజా శ్రీ‌దేవిని గుర్తు చేసింది. గ‌ద్దల కొండ గణేష్ గా వ‌రుణ్ తేజ్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. అయితే ఫ‌స్టాఫ్ ని మించి సెకండాఫ్ లో ఇంకేమైనా కొత్త‌గా చూపించారా? అంటే ఏదీ క‌నిపించ‌దు. ఓవ‌రాల్ గా ఇదో యావ‌రేజ్ అన్న‌ ఫీల్ ని క‌లిగిస్తుంది.

నటీనటులు:

వ‌రుణ్ తేజ్ న‌ట‌న ఈ సినిమాలో ప్ర‌ధాన హైలైట్. గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ పాత్ర‌కు త‌గ్గ ఆహార్యంతో క‌ట్టి ప‌డేశాడు. ఇందులో నెగెటివ్ షేడ్ పాత్ర త‌న‌దే కాబ‌ట్టి న‌టించేందుకు స్కోప్ ఎక్కువ‌గా దొరికింది. పూజా హెగ్డే అంద‌చందాలు మ‌రో ఆక‌ర్ష‌ణ‌. అధ‌ర్వా-మృణాళిని జంట క్యూట్ రొమాన్స్ తో ఆక‌ట్టుకున్నారు. ఇత‌ర పాత్ర‌లు ప‌రిధిమేర ఆక‌ట్టుకున్నాయి.

టెక్నికాలిటీస్:
మిక్కీ.జే సంగీతం .. రీరికార్డింగ్ ప్ల‌స్. హ‌రీష్ శంక‌ర్ మార్క్ మాస్ ద‌ర్శ‌క‌త్వ శైలి ఓకే. ఎడిటింగ్.. సినిమాటోగ్ర‌ఫీ ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

* ఎంచుకున్న పాయింట్
* వ‌రుణ్ తేజ్ లుక్.. న‌ట‌న‌.. ఎక్స్ ప్రెష‌న్స్
* పూజాహెగ్డే, అధ‌ర్వ‌, మృణాళిని న‌ట‌న‌
* జ‌ర్ర జ‌ర్ర సాంగ్

మైనస్ పాయింట్స్:

* రొటీన్ స్క్రీన్ ప్లే
* కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం .. రొటీనిటీ..
* మిరాకిల్ అన‌ద‌గ్గ పాయింట్స్ లేక‌పోవ‌డం

ముగింపు:
వ‌రుణ్ తేజ్ గ‌ర‌మ్.. వాల్మీకి తండా

రేటింగ్:
2.5/5