ఆ `మ‌హ‌ర్షి`ని లిఫ్ట్ చేశాడా?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ టైటిల్ రివీలైంది. రిషి అంటూ ఊరిస్తూనే `మ‌హ‌ర్షి` అని చెప్పేశారు. టైటిల్ ప్ర‌క‌ట‌న‌తో పాటు టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. కొన్ని సెక‌న్ల పాటు సాగే ఈ టీజ‌ర్‌లో మ‌హేష్ గ్లింప్స్ మామూలుగా లేవంటే అతిశ‌యోక్తి కాదు. లైట్‌గా గ‌డ్డం పెంచి, జుత్తు స‌వ‌రించుకుంటూ అమ్మాయిల‌కు లైనేసే కాలేజ్ బుల్లోడిగా ఓ రేంజులో ఝ‌ల‌కిచ్చాడు మ‌హేష్‌. బాబు 40కి ద‌గ్గ‌ర‌గా ఉన్నా.. 20 మైన‌స్‌లా క‌నిపించాడు. నిన్న‌గాక మొన్ననే కాలేజ్‌లో చేరిన కొంటె కుర్రాడిలా క‌నిపించాడు. సాప్ట్‌గా న‌వ్వేస్తూనే సైడు కోసేశాడు.

టైటిల్ ఫెంటాస్టిక్‌. మ‌హేష్ లుక్ మైండ్ బ్లోయింగ్‌. గాళ్స్ అయితే మ‌తి చెడి మంచ‌మెక్క‌డం ఖాయం. టీజ‌ర్‌, టైటిల్‌పై మ‌హేష్ అభిమానుల్లో స్పంద‌న అద్భుతంగా ఉంది. ప‌నిలో ప‌నిగా మ‌రో విష‌యాన్ని జ‌నం గుర్తు చేసుకుంటున్నారు. ఆరోజుల్లో వ‌చ్చాడు ఒక `మ‌హ‌ర్షి`. అత‌డు కూడా కాలేజ్ స్టూడెంట్. గ‌డ్డం పెంచిన ల‌వ‌ర్‌బోయ్ కూడా. పైగా ఆ మ‌హ‌ర్షి గుంటూరు మిర్చిలాంటోడు. ఆ సినిమా క‌థే వేరు. ల‌వ్‌స్టోరీల్లోనే ఓ ట్రెండ్ సెట్ట‌ర్. ఓ రిచ్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన యారొగెంట్ కాలేజ్ కుర్రాడిగా మ‌హ‌ర్షి రాఘ‌వ ఆ సినిమాలో అద్భుతంగా న‌టించాడు. ప్రేమించాను అని వెంట‌ప‌డ‌తాడు. ఛీ .. పో! అంటుంది శాంతి ప్రియ‌. భానుప్రియ చెల్లి శాంతి ప్రియ‌కు ఇది బ్రేకింగ్ మూవీ. ఇదే చిత్రంలో ఇప్ప‌టి టాప్ క‌మెడియ‌న్ కృష్ణ భ‌గ‌వాన్ న‌టించాడు. ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంభాష‌ణ‌లు అంతే హైలైట్‌. ఆ పిల్ల అమ్మా నాన్న ఒప్పుకున్నా.. ఆ యారొగెంట్ స్టుపిడ్‌కి నేను ప‌డ‌ను గాక‌ ప‌డ‌నంటుంది శాంతి ప్రియ‌. చివ‌రికి త‌న ప్రేమ‌కోసం పిచ్చివాడైపోతాడు. గ‌డ్డాలు పెంచుకుని దేవ‌దాసు అయిపోతాడు. చివ‌రికి ముగింపు క‌థేంటో అంద‌రికీ తెలిసిందే.

మ‌హేష్ గ‌డ్డం చూశాక గుర్తుకొచ్చే పాత జ్ఞాప‌కం ఇది. అయితే ఈ సినిమాతో మ‌హేష్ అంత డీప్ ల‌వ్‌స్టోరీని ఎలివేట్ చేస్తాడా? రాఘ‌వ `మ‌హ‌ర్షి`ని గుర్తు చేస్తాడా? బోలెడ‌న్ని అనుమానాలు. ఆ మ‌హ‌ర్షి కాలేజ్ స్టూడెంట్‌.. ఈ మ‌హ‌ర్షి కాలేజ్ స్టూడెంట్.. కాలేజ్ ల‌వ్‌స్టోరి కాబ‌ట్టి.. ఏమో! ఏదైనా జ‌ర‌గొచ్చు అని సందేహాలు క‌లిగాయ్‌. అస‌లే రైతు బిడ్డ‌డు కాబ‌ట్టి అంత రిచ్ కాక‌పోవ‌చ్చు కానీ, కాలేజ్‌లో డీప్ ల‌వ్‌లో ప‌డే కాలేజీ బుల్లోడిలానే క‌నిపిస్తున్నాడు. ఈ మ‌హ‌ర్షి క‌థేంటో వంశీ పైడిప‌ల్లికే ఎరుక‌. ఆయ‌నే అస‌లు క‌థ చెబుతాడేమో చూడాలి.

User Comments