తెలుగు తెర‌కు విశాల్ మాజీ ప్రేయ‌సి?

Last Updated on by

హీరో విశాల్‌, త‌మిళ హీరోయిన్‌, శ‌ర‌త్‌కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి గ‌త కొంత కాలంగా ప్రేమలో వున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మి కొట్టి పారేస్తూనే వున్నారు. అయినా చాలా కాలంగా వీటి తాకిడి ఆగ‌లేదు. తాజాగా విశాల్ `పెళ్లిచూపులు`, అర్జున్‌రెడ్డి` చిత్రాల ఫేమ్ హైద‌రాబాద్ అమ్మాయి అనీషాని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప‌బ్లిగ్గా ప్ర‌క‌టించేశాడు. అయినా విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మి ప్ఏమ‌క‌థ కంచికి చేర‌డానికి కార‌ణం ఎవ‌రు అనే రంధ్రాన్వేష‌ణ జ‌రుగుతూనే వుంది.

ఇదిలా వుంటే త‌మిళ క‌థానాయిక‌ల్లో హైప‌ర్ యాక్టీవ్‌గా వుండే వ‌ర‌ల‌క్ష్మిత్వ‌ర‌లో తెలుగులో తెరంగేట్రం చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. త‌న చిర‌కాల మిత్రుడు విశాల్ హైద‌రాబాద్ అల్లుడు అవుతుంటే వ‌ర‌ల‌క్ష్మి మాత్రం అదే హైద‌రాబాద్‌కు రావ‌డం కోసం ఓ తెలుగు సినిమా అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. దీనికి సంబ‌ధించిన ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌ను వ‌ర‌ల‌క్ష్మి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. `తొలిసారి తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్నందుకు అనిర్వ‌చ‌నీయ మైన అనుభూతికి లోన‌వుతున్నాను. సందీప్‌కిష‌న్ తో క‌లిసి తొలిసారి తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాను` అని ట్వీట్ చేసింది.

గ‌త కొంత కాలంఆ స‌రైన హిట్‌లు లేని సందీప్‌కిష‌న్ మ‌ళ్లీ స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న ఆయ‌న తాజాగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వ‌ర‌ల‌క్ష్మి క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతోంది. `ఒక్క అమ్మాయి త‌ప్ప‌` ఫేమ్ రాజ‌సింహా క‌థ‌, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నీ చిత్రాన్ని రెండు లేదా మూడు షెడ్యూళ్ల‌లో పూరి్త చేసి స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. విశాల్ పెళ్లి కూడా ఈ స‌మ్మ‌ర్‌లోనే జ‌రిగే అవ‌కాశం వుంది.

User Comments