ప్ర‌భాస్ పై వ‌ర్మ సంచ‌న‌ల కామెంట్

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం వివాదాన్ని సైతం లెక్క చేయ‌ని ఘ‌నుడు. వివాదంతోనే సినిమాని మార్కెట్ చేయ‌గ‌ల దిట్ట‌. వివాదాల‌తో చెలిమి చేయ‌డం ఆయ‌న‌కో హాబీ. తాజాగా క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమా విష‌యంలో అదే పంథాను అనుస‌రిస్తున్నాడు. ఈసారి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ టార్గెట్ త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. దానికి సంబంధించి ఓ సంచ‌ల‌న వీడియో కూడా రిలీజ్ చేసాడు.

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌భాస్ సాహో సినిమా కోసం క‌ళ్లు వాచిపోయేలా ఎదురుచూ స్తున్నాను. ఎందుకంటే ప్ర‌భాస్ నాక్యాస్ట్ కాబ‌ట్టి. ఈ సంద‌ర్భంగా నా నెక్స్ట్ సినిమా క‌మ్మ రాజ్యంలోని క‌డ‌ప రెడ్లు లోని ఒక పాట‌ని 27 వ తారీఖు ఉద‌యం 9 గంట‌ల 27 నిమిషాల‌కు బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ చేబోతున్నాం అని ఓ ప్రోమో రిలీజ్ చేసాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. సాహో రిలీజ్ స‌మ‌యంలో వ‌ర్మ బాణాలేంట‌ని మ‌ద‌న ప‌డుతున్నారు.