Varma Targets Lakshmi Parvathi-ల‌క్ష్మీపార్వ‌తిని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.

ల‌క్ష్మీపార్వ‌తిని టార్గెట్ చేసిన వ‌ర్మ‌..

Varma Targets Lakshmi Parvathi

వ‌ర్మ ఏదైనా అనుకుంటే అంత ఈజీగా వ‌ద‌ల‌డు. ఇప్పుడు ఆయ‌న క‌న్ను ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నేం చేస్తాడులే.. ఓ మాట చెప్పి వ‌దిలేస్తాడేమో అనుకున్నారు కానీ సీన్ చూస్తుంటే వ‌ర్మ ఈ బ‌యోపిక్ పై చాలా సీరియ‌స్ గానే ఉన్నాడు. మెల్ల‌గా గ్రౌండ్ వ‌ర్క్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ను తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాతే.. ఆయ‌న జీవితంలో ఎప్పుడూ చూడ‌ని మార్పు మొదలైంది. చివ‌రి రోజుల్లో ఆయన మాన‌సిక ప‌రిస్థితుల్లోకి వెళ్లడానికి కారణం ఏమిటి అనేది తాను సినిమాలో చూపిస్తానని వర్మ తెలిపారు. సినిమాల్లో ఏయే పాత్ర‌లు ఉంటాయో నేనిప్పుడు చెప్ప‌ను.. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో ఏమీ మాట్లాడ‌లేదు.. వారు రామారావు గురించి చెప్పాల్సింది అంతా ఇప్ప‌టికే మీడియా ముందు చెప్పేశారు. నేను మాత్రం ఎన్టీఆర్ గురించి ఎవ్వ‌రికీ తెలియంది చూపాల‌నుకుంటున్నాను.. అంటున్నాడు వ‌ర్మ‌. మ‌రి ఆ తెలియ‌ని విష‌యాలు.. వ‌ర్మ‌కు మాత్ర‌మే తెలిసిన విష‌యాలేంటి అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా అంటే లక్ష్మీపార్వతి చెప్పింది తీస్తాడు.. ఆమె గురించి తీస్తాడు.. ఆమె కోణంలో సినిమా సాగుతుంది అనుకుంటే పొర‌పాటే. ఆమె వ‌చ్చిన త‌ర్వాత ఎన్టీఆర్ జీవితం ఏమైంది అనేది త‌న క‌థ అంటున్నాడు వ‌ర్మ‌. అది కూడా ఓ ఘ‌ట్టం మాత్ర‌మే. ఎన్టీఆర్ జీవితం త‌న‌కు ఓ మహాభారతంలా అనిపించింద‌ని.. అందులో చాప్ట‌ర్లు చాలానే ఉన్నాయ‌ని.. తాను కేవ‌లం ల‌క్ష్మీపార్వ‌తి అనే చాప్ట‌ర్ మాత్ర‌మే తీసుకున్నట్లు చెప్పాడు వ‌ర్మ‌. ఆయన సినీ జీవితం.. రాజకీయాలు.. ముఖ్యమంత్రి కావ‌డం.. నాదేండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్.. చంద్ర‌బాబుతో వివాదం.. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ఇలా చాలా ఉన్నాయి. వీట‌న్నింటినీ రెండు గంట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం. అందుకే తాను కేవ‌లం లక్ష్మి పార్వతి వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచే క‌థ చెప్పాల‌ని చూస్తున్న‌ట్లు క్లారిటీగా చెప్పాడు వ‌ర్మ‌. మ‌రి చూడాలిక‌.. ఈ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..? ఎవ‌రి కొంప ముంచ‌బోతుందో..?

ల‌క్ష్మీపార్వ‌తిని టార్గెట్ చేసిన వ‌ర్మ‌..
0 votes, 0.00 avg. rating (0% score)