టీజ‌ర్‌: `అంత‌రిక్షం`లో క్ష‌ణ‌క్ష‌ణం!

Last Updated on by

రెప్ప వేసి తెరిచే లోపు ప్ర‌మాదం ముంచుకొస్తే.. డేంజ‌ర్ బెల్ మోగితే.. ఉచ్ఛాస , నిశ్వాస‌లే ఆగిపోయేంత ఉత్క ంఠ నెల‌కొంటే.. ! అవును అలాంటి సినిమాని మ‌నం చూడ‌బోతున్నామా? అంటే అవున‌నే సంకేతం ఇచ్చింది `అంత‌రిక్షం 9000 కెఎంపిహెచ్‌` టీజ‌ర్. వ‌రుణ్‌తేజ్ – సంక‌ల్ప్ రెడ్డి ఈ స్క్రిప్టును ఎంచుకున్న‌ప్పుడే ఆ సాహ‌సాన్ని అంతా మెచ్చారు. యంగ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మ‌ర్ప‌కుడిగా బ్యాక్ బోన్‌గా నిలిచి, రాజీవ్ రెడ్డి, రాజా చెంబోలు వంటి వారితో క‌లిసి పెద్ద ప్ర‌యోగానికే తెర లేపారు. అస‌లు తెలుగులో స‌బ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఏంటి? అనుకున్న వాళ్ల‌కు స‌ముద్ర గ‌ర్భ ంలో వింత విన్యాసాల్ని చూపించిన సంక‌ల్ప్ ఈసారి అంతే ఘ‌టికుడిగా అంత‌రిక్షంలో క్ష‌ణ‌క్ష‌ణం చూపించే తెగెవ క‌న‌బ‌రుస్తున్నాడు. హాలీవుడ్ సినిమాలు గ్రావిటీ , స్పేస్ ఒడిస్సీ, త‌మిళ చిత్రం టిక్ టిక్ టిక్ .. వీటికి ఏమాత్రం తీసిపోని విజువ‌ల్ గ్లింప్స్ ఒక చిన్న టీజ‌ర్‌లోనే చూపించి శ‌హ‌భాష్ అనిపించారు.

ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహిర స్పేస్ ప్రాజెక్ట్ టీమ్ లో వరుణ్ తేజ్ పాత్ర ఏంటి? టీమ్ మేట్స్ ఆదితిరావు హైదరి, సత్యదేవ్ పాత్ర‌లేంటి అన్న‌ది తెర‌పైనే చూడాలి. అంత‌రిక్షంలో అవాంత‌రాలొస్తే ఎలాంటి సాహ‌సాలు చేయాలి? మిష‌న్‌ని విజ‌య‌వంతంగా ఎలా పూర్తి చేయాలో స్ఫూర్తివంతంగా తీస్తున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. అయితే ఇలాంటి ప్ర‌యోగం స‌క్సెస‌వ్వాలంటే క‌చ్ఛితంగా శ్వాస ఆడ‌నివ్వ‌ని, కుర్చీ అంచుకున కూచుని నోరెళ్ల‌బెట్టేలా విజువ‌ల్స్ చూపిస్తేనే ఫ‌లితం ఉంటుంది. మ‌రి అందులో సంక‌ల్ప్ విజ‌యం సాధిస్తాడ‌నే ఆశిద్దాం. సీజీ వ‌ర్క్‌కి స‌రైన డ్రామా ను జోడించి సంక‌ల్ప్ చేస్తున్న ఈ ప్ర‌యోగం.. ప్ర‌స్తుత ట్రెండ్‌లో అంద‌రికీ న‌చ్చే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

User Comments