వ‌రుణ్ కూడా అమ్మేస్తున్నాడుగా..!

Last Updated on by

ముందు చిరంజీవి.. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఆ వెంట‌నే బ‌న్నీ.. మొన్న రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్.. ఇలా మెగా ఫ్యామిలీలో ప్ర‌తీ హీరో యాడ్ వ‌రల్డ్ లోకి వ‌స్తూనే ఉన్నాడు. ఇప్ప‌టికే చిరు.. ప‌వ‌న్ దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ల లెగ‌సీని అంతా కంటిన్యూ చేస్తున్నారు. మొన్నే రామ్ చ‌ర‌ణ్ హ్యాపీ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక‌య్యాడు. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కూడా వ‌చ్చేసాడు. ఈయ‌న ఆర్ఎస్ బ్ర‌ద‌ర్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సెలెక్ట్ అయ్యాడు.

వ‌ర‌స హిట్ల‌తో జోరు మీదున్న వ‌రుణ్ తేజ్ కు బ్రాండ్ వ్యాల్యూ కూడా బాగానే పెరిగిపోయింది. పైగా అందంగా ఉంటాడు. మెన్స్ వేర్ కు అదిరిపోయే ఫిజిక్ వ‌రుణ్ తేజ్ సొంతం. దాంతో ఆర్ఎస్ బ్ర‌ద‌ర్స్ ఈ మెగా వార‌సున్ని కోరుకుంది. ప్ర‌స్తుతం ఈయ‌న సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం సినిమాలో న‌టిస్తున్నాడు. స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. దాని త‌ర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్ 2లో న‌టించ‌బోతున్నాడు.

User Comments