వరుణ్ తో స్టెప్పులేయించేసారే..!

Last Updated on by

మెగా హీరోలు అంటేనే కేరాఫ్ మాస్ హీరోలు ప్లస్ డాన్సులు. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చి డాన్సులకు దూరంగా ఉన్నది పవన్ కళ్యాణ్ తర్వాత వరుణ్ తేజే. పవన్ అయినా వేసే కొన్ని స్టెప్పులు తన స్టైల్ తో వేస్తుంటాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ పెద్దగా కాలు కదిపింది లేదు. పైగా ఆరున్నర అడుగుల కటౌట్ తో మనోడు స్టెప్పులేస్తుంటే చూడ్డానికి కూడా ఆకట్టుకునేలా ఉండదు. అందుకే బాబాయ్ లా అలా అలా నడిపిస్తుంటాడు ఈ కుర్ర హీరో. కానీ ఇప్పుడు తొలిప్రేమ కోసం ఒళ్లొంచాడు వరుణ్ తేజ్. శేఖర్ మాస్టర్ తో కలిసి మంచి స్టెప్పులు వేసాడు. కాలు కదిపాడు.. చెమట చిందించాడు. అలవాటు లేని కష్టమైన స్టెప్పులు కూడా బాగానే వేసాడు మెగా ప్రిన్స్. ఈ డాన్సులు చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే కచ్చితంగా ఫిదా అయిపోతారేమో..? ఇప్పట్నుంచీ ప్రతీ సినిమాలో తనకు వచ్చినంతగా డాన్సులు వేస్తానంటున్నాడు వరుణ్ తేజ్. పైగా తాను బన్నీ, చరణ్ లాంటి డాన్సర్ ను కాదని.. వచ్చినట్లు వేస్తుంటాను.. క్షమించండి అంటూ అభిమానులకు చెప్పుకున్నాడు కూడా ఈ మెగా రాజకుమారుడు. మొత్తానికి ఏదో అలా నడవకుండా.. మిగిలిన వాళ్లలా స్టెప్పులేయడానికి ప్రయత్నాలైతే చేస్తున్నాడు కదా.. అది చాలు అంటున్నారు అభిమానులు.

User Comments