వరుణ్ తేజ్ ఇంటిలిజెంట్ గేమ్

Last Updated on by

అవును.. మెగా క్లాష్ కు తెర‌ప‌డే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఫిబ్ర‌వ‌రి 9న ఒకేరోజు ఐదు సినిమాలు వ‌స్తున్నాయ‌నే సంగ‌తి చాలా కాలంగా వినిపిస్తుందే. ఆ రోజు తొలిప్రేమ‌తో పాటు సాయిధ‌రంతేజ్ ఇంటిలిజెంట్.. సాయిప‌ల్ల‌వి క‌ణం.. నిఖిల్ కిరాక్ పార్టీ.. మోహ‌న్ బాబు గాయ‌త్రి సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇందులో క‌ణం సినిమాపై ఇప్ప‌టికీ ఎలాంటి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. ఆ సినిమా వ‌స్తుందా రాదా అనే విష‌యంపై క్లారిటీ లేదు. అయితే మెగా వార్ కు మాత్రం ఇప్పుడు బ్రేక్ ప‌డిపోయే స‌మ‌యం వ‌చ్చేసింది. వ‌రుణ్ తేజ్ సినిమానే చివ‌రికి కాంప్రమైజ్ అయిపోయింది.

వ‌రుణ్ న‌టించిన తొలిప్రేమ ఫిబ్ర‌వ‌రి 9 కాకుండా ఒక్క‌రోజు ఆల‌స్యంగా వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ చిత్రం రానుంది. దానికి కార‌ణం దిల్ రాజు అని తెలుస్తుంది. ఎందుకంటే తొలిప్రేమ‌ను ఔట్ రేటెడ్ గా కొన్నాడు రాజు. ఒకేరోజు అన్ని సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా అంద‌రికీ న‌ష్ట‌మే అని ఆలోచించిన దిల్ రాజు.. తొలిప్రేమ‌నే ఒక్క‌రోజు ఆలస్యంగా తీసుకొస్తున్నాడు. అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ త్వ‌ర‌లోనే రానుంది. ఇదే జ‌రిగితే సాయిధ‌రంతేజ్ కు బామ్మ‌ర్ది నుంచి పోరు త‌ప్పిన‌ట్లే. క‌ణం కూడా చివ‌రికి వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. అంటే ఫిబ్ర‌వ‌రి 9న గాయ‌త్రి.. ఇంటిలిజెంట్.. కిరాక్ పార్టీ మాత్ర‌మే రానున్నాయ‌న్న‌మాట‌. తొలి ప్రేమ త‌ర్వాతి రోజు రానుంది. మ‌రి.. ఈ వార్ లో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో..?

Follow US 

User Comments