వ‌రుణ్ తేజ్ కి పెళ్లి?

మెగా వార‌సుడిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన వ‌రుణ్ తేజ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వైవిథ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వాల్మీకి సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన వ‌రుణ్ ఫ‌స్ట్ లుక్ మాస్ డైలాగులు బాగా క‌నెక్ట్ అయ్యాయి. హిట్టు కొట్టేలానే ఉన్నాడు. ఇంత‌లోనే వ‌రుణ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది. అతి త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడ‌ని చిత్ర‌పురి కాల‌నీ వాసుల నోట హాట్ టాపిక్ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ పారిశ్రామిక నేప‌థ్యం కలిగిన కుటుంబంతో పెళ్లికి సంబంధించిన మాట, మంతి జ‌రిగిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మెగా బ్రదర్ నాగబాబు అండ్ ఫ్యామిలీ ఇటీవ‌లే ఆ బఢా వ్యాపారవేత్త కుటుంబంతో మాట్లాడివ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ వ్యాపార వేత్త ఎవ‌రు? అన్న వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంతో తేలాలి. అయితే వ‌రుణ్ పెళ్లి క‌న్నా ముందు నిహారిక పెళ్లి చేసేస్తాన‌ని నాగ‌బాబు ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. నిహారిక‌కు సినిమాల విష‌యంలో కొంతటైమ్ మాత్ర‌మే ఇచ్చాన‌ని, త‌ర్వాత పెళ్లి చేసి పంపిచేస్తాన‌ని, ఆ స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర‌ప‌డింది ఇటీవ‌లే చెప్పారు. కానీ ఇంత‌లోనే వ‌రుణ్ పెళ్లి విష‌యం మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.