తొలిప్రేమ ఎంత తెచ్చింది.. ఎంత తేవాలి..?

Last Updated on by

సినిమా విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళు ద‌క్కించుకుంటుంది తొలిప్రేమ‌. మాస్ సినిమాల‌తో పోలిస్తే క్లాస్ సినిమాల‌కు కాస్త క‌లెక్ష‌న్లు త‌క్కువ‌గా వ‌స్తాయంటారు. అది ట్రేడ్ చెబుతున్న నిజం కూడా. కానీ ఇక్క‌డ‌ సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఇంటిలిజెంట్ పూర్తిగా తొలిరోజే సైలెంట్ అయిపోతే బాక్సాఫీస్ ను మ‌రోవైపు తొలిరోజు నుంచే ద‌త్త‌త తీసుకున్నాడు వ‌రుణ్ తేజ్. తొలిప్రేమ‌తో ఈయ‌న క‌లెక్ష‌న్లు కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా కుర్రాళ్లైతే తొలిప్రేమ‌ను ఓన్ చేసుకున్నారు. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల వైపుగా అడుగేస్తుంది తొలిప్రేమ‌. వ‌రుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోకు ఇది చాలా ఎక్కువ క‌లెక్ష‌న్లు.

ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ దాదాపుగా మిలియన్ డాలర్ కి దగ్గరలో ఉంది తొలిప్రేమ‌. నేడో రేపో ఖచ్చితంగా సినిమా మిలియ‌న్ క్ల‌బ్ లో చేర‌డం ఖాయం. దీని జోరు చూస్తుంటే అక్క‌డ ఈజీగా 1.3 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ఈ తొలిప్రేమ‌తో బాగానే ప్రేమ‌లో ప‌డిపోయారు. పైగా వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన విధానం కూడా చాలా బాగుంది. వ‌ర‌ణ్ తేజ్, రాశీఖ‌న్నా మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఓవ‌ర్సీస్ లోనే కాదు.. ఇక్క‌డ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తుంది తొలిప్రేమ‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న ద‌గ్గ‌ర 17 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓవ‌రాల్ గా 9 రోజులకే 21 కోట్లు వ‌సూలు చేసింది తొలిప్రేమ‌. మ‌రో కోటిన్న‌ర వ‌సూలు చేస్తే చాలు సినిమా హిట్ లిస్ట్ లోకి వెళ్లిపోతుంది. ఏదేమైనా వ‌రుణ్ తేజ్ కు వ‌ర‌స‌గా రెండో విజ‌యం వ‌చ్చేసింది.

User Comments