అందరూ తొలిప్రేమకు పడిపోయారు

Last Updated on by

వ‌రుణ్ తేజ్ కూడా మెల్ల‌గా స్టార్ అయిపోతున్నాడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కాస్త టైమ్ ప‌ట్టింది ఈ కుర్రాడికి ప్రేక్ష‌కుల చెంత చేరడానికి. ఇప్పుడు ప‌ర్లేదు సెట్ అయిపోయాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటూ మెగా ఫ్యామిలీ ప‌రువు నిల‌బెడుతూ ప‌రుగు తీస్తున్నాడు. మొన్న ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు.. ఇప్పుడు తొలిప్రేమ‌తో మ‌రో హిట్ కొట్టాడు. అప్పుడు క్రెడిట్ అంతా సాయిప‌ల్ల‌వి ప‌ట్టుకెళ్లిపోయినా.. ఇప్పుడు మాత్రం నేనే అంటూ మొత్తం వ‌ర‌ణ్ తేజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లోనూ దుమ్ము దులిపేసింది. అక్క‌డ మిలియ‌న్ మార్క్ అందుకుంది ఈ చిత్రం.

యుఎస్ లో వ‌ర‌స‌గా రెండో సారి కూడా మిలియ‌న్ మార్క్ అందుకున్నాడు వ‌రుణ్ తేజ్. కాస్త కానీ కెరీర్ ట్యూన్ చేసుకుంటే వ‌రుణ్ తేజ్ కు ఓవ‌ర్సీస్ మార్కెట్ వ‌రంగా మార‌డం ఖాయం. సాయిధ‌రంతేజ్, చ‌ర‌ణ్ లాంటి హీరోల‌కే అక్క‌డ మార్కెట్ జీరో. ఈ హీరోల సినిమాల‌ను అక్క‌డి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అందుకే ఇప్పుడు ఓవ‌ర్సీస్ మార్కెట్ కీల‌కం అయిపోయింది. విడుద‌లైన రెండు వారాల త‌ర్వాత తొలిప్రేమ ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ డాల‌ర్ మార్క్ అందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 24 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ అయింది మాత్రం 22.5 కోట్ల‌కే. అంటే ఇప్ప‌టికే సేఫ్ జోన్ కు వ‌చ్చేసి లాభాలు కూడా తీసుకొచ్చింది ఈ చిత్రం. ఏదేమైనా మొత్తానికి వ‌ర‌స‌గా రెండో విజ‌యంతో కెరీర్ కు మంచి పునాది వేసుకున్నాడు వ‌రుణ్ తేజ్.

User Comments