తొలిప్రేమ‌.. ఓవ‌ర్సీస్ ప్రేమ‌లో ప‌డింది

Last Updated on by

తెలుగు సినిమాకు ఇప్పుడు ఓవ‌ర్సీస్ అనేది అక్ష‌య పాత్ర‌. దాన్ని ఎంత‌బాగా కాపాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మ‌న హీరోలు ఇదే చేస్తున్నారు. సినిమా సినిమాకు అక్క‌డ మార్కెట్ పెంచుకుంటున్నారు. గ‌తేడాది ఫిదా సినిమాతో ఏకంగా అక్క‌డ 2 మిలియ‌న్ మార్క్ అందుకున్న వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా అడుగేస్తున్నాడు. ఈయ‌న న‌టించిన తొలిప్రేమ ఇండియా కంటే ఓ రోజు ముందే అక్క‌డ విడుద‌లై.. మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ హాఫ్ మిలియ‌న్ దాటేసి.. మిలియ‌న్ వైపుగా అడుగేస్తుంది. ఓవ‌ర్సీస్ లో మూడు రోజుల్లో 5 ల‌క్ష‌ల డాలర్ల పైన వ‌సూలు చేసింది తొలిప్రేమ‌. వ‌రుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోకు ఇది చాలా ఎక్కువ క‌లెక్ష‌న్లు. దీని జోరు చూస్తుంటే అక్క‌డ ఈజీగా 1.3 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ఈ తొలిప్రేమ‌తో బాగానే ప్రేమ‌లో ప‌డిపోయారు. పైగా వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన విధానం కూడా చాలా బాగుంది. వ‌ర‌ణ్ తేజ్, రాశీఖ‌న్నా మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఓవ‌ర్సీస్ లోనే కాదు.. ఇక్క‌డ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తుంది తొలిప్రేమ‌. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 3.23 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. వ‌రుణ్ గ‌త సినిమాలు ముకుందా, ఫిదా, లోఫ‌ర్ కంటే ఇవి త‌క్కువ వ‌సూళ్లే అయినా కూడా ఇప్ప‌టి మార్కెట్ తో పోలిస్తే చాలా మంచి క‌లెక్ష‌న్లే. రెండోరోజు కూడా తొలిప్రేమ జోరు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇంకా పెరుగుతుంది కూడా. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 24 కోట్లు రావాలి. వ‌చ్చే వారం ఒక్క అ.. త‌ప్ప పెద్ద సినిమాలేవీ లేవు. దాంతో ఈజీగా తొలిప్రేమ‌తో వ‌రుణ్ తేజ్ కు మ‌రో భారీ విజ‌యం ద‌క్కిన‌ట్లే..!

User Comments