తొలిప్రేమ‌తో వ‌రుణ్ కు తెగిన బంధం

Last Updated on by

అవును.. వ‌రుణ్ తేజ్ కు తొలిప్రేమ‌తో బంధం తెగిపోయింది. ఇక ఆయ‌న ఈ సినిమా గురించి ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. విడుద‌ల‌కు పదిరోజుల ముందే ఫ‌స్ట్ కాపీ సిద్ధం చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంతో వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. వ‌రుణ్ కూడా ఈ చిత్రంలో చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఫిదా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో తొలిప్రేమ‌పై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ఔట్ రేటెడ్ గా కొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 10న సినిమా విడుద‌ల కానుంది. ఆ లోపు సినిమా ప‌నుల‌న్నీ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

తాజాగా ఈ చిత్రంలో డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసాడు వ‌రుణ్ తేజ్. ఫైన‌ల్లీ డ‌న్ అంటూ ట్విట్ట‌ర్ లో మెసేజ్ కూడా పెట్టాడు ఈ మెగా హీరో. అయితే ఫిబ్ర‌వ‌రి 1 ఉద‌యం 11 గంట‌ల‌కు రావాల్సిన ట్రైల‌ర్ మాత్రం ఇప్ప‌టికీ రాలేదు. కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో తొలిప్రేమ ట్రైల‌ర్ ఆల‌స్యంగా రానుంది. ఈ విష‌యంపై చిత్ర‌యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి 9నే రావాల్సి ఉన్నా కూడా సాయిధ‌రంతేజ్ తో పోటీ ప‌డ‌టం ఎందుక‌ని ఓ రోజు ఆల‌స్యంగా తొలిప్రేమ‌ను తీసుకొస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముఖ్యంగా దిల్ రాజు ఈ డీల్ లో ముందడుగేసాడు. ఒకేరోజు అన్ని సినిమాలు వ‌స్తే అంద‌రికీ న‌ష్ట‌మే అని తెలిసి.. త‌నే ఓ అడుగు వెన‌క్కి వేసాడు వ‌రుణ్ తేజ్.

User Comments