తొలిప్రేమ‌.. ప్రీమియ‌ర్ షో టాక్ ఏంటి..?

Last Updated on by

ఒక‌రోజు ముందే వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ ఎలా ఉందో టాక్ బ‌య‌టికి వ‌చ్చేసింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. నిజానికి ఫిబ్ర‌వ‌రి 9నే తొలిప్రేమ విడుద‌ల కావాలి. కానీ ఇక్క‌డ పోటీ ఉండటంతో సినిమాను ఒక్క‌రోజు ఆల‌స్యంగా తీసుకొస్తున్నారు. అయితే ఓవ‌ర్సీస్ లో మాత్రం ఫిబ్ర‌వ‌రి 8నే ప్రీమియ‌ర్స్ అంటూ థియేట‌ర్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఇక్క‌డ పోస్ట్ పోన్ చేసినంత ఈజీ కాదు అక్క‌డ వాయిదా వేయ‌డం. అందుకే బుక్ అయిన థియేట‌ర్స్ లో ముందు రోజే ప్రీమియ‌ర్స్ వేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక‌రోజు ముందే ప్రీమియ‌ర్స్ అంటే డేంజ‌ర్ అని తెలుసు కానీ డేర్ చేసారు తొలిప్రేమ యూనిట్. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే తొలిప్రేమ రొటీన్ గానే ఉన్నా.. సూప‌ర్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్, స్టార్ ప‌వ‌ర్, థ‌మ‌న్ క్లాసీ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి అంటున్నారు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు. ఈ మ‌ధ్య కాలంలో థ‌మ‌న్ ఏ సినిమాకు ఇవ్వ‌నంత బెస్ట్ ఆర్ఆర్ ఈ సినిమాకు ఇచ్చాడ‌ని తెలుస్తుంది. అంతేకాదు.. అత‌డి మ్యూజిక్ తోనే సినిమా రేంజ్ కూడా పెరిగింది. క‌థ కంటే కూడా.. ద‌ర్శ‌కుడి టేకింగ్ చాలా బాగుందంటున్నారు. వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయ‌ని.. వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ అదుర్స్ అంటున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ తో పాటు వ‌రుణ్ తేజ్ ఫిదా బ్రాండ్ ప‌డితే సినిమా హిట్ అనే అంచ‌నాలున్నాయి. క్లాస్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి తొలిప్రేమ మంచి మార్కులే వేయించుకుంటుంద‌ని న‌మ్ముతున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. తొలిప్రేమ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు.

User Comments