తొలిప్రేమ రీమేక్ ఫిదా..!

Last Updated on by

తొలిప్రేమ సినిమాతో వ‌రుణ్ తేజ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఈ చిత్రం సోలోగా 23 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఫిదా కూడా దాదాపు 50 కోట్లు షేర్ వ‌సూలు చేసి మెగా వార‌సుడి మార్కెట్ ను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిదా మ‌రోసారి విడుద‌లైంది. అది కూడా తొలిప్రేమ సినిమాను రీమేక్ చేస్తే..! అది ఎలా సాద్య‌మైంది అనుకుంటున్నారా..? ఇక్క‌డే క‌దా అస‌లు విచిత్రం దాగుంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న తొలిప్రేమ విడుద‌లైంది. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బెంగాలిలో రీమేక్ చేసారు. దీనికి ఫిదా అనే టైటిల్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌న‌కు చూడ్డానికి చాలా వింత‌గా విచిత్రంగా అనిపిస్తుంది క‌దా..! ఎందుకంటే ఇక్క‌డ ఈ రెండు సినిమాలు వ‌రుణ్ తేజ్ వే కావ‌డం విశేషం. ఇప్పుడు ఇదే సినిమాను అక్క‌డ రీమేక్ చేసి.. మ‌ళ్లీ వ‌రుణ్ తేజ్ సినిమా టైటిల్ నే పెట్ట‌డం కొత్త‌గా అనిపించింది. య‌శ్ దాస్ గుప్తా, సంజ‌న బెంగాలి తొలిప్రేమలో న‌టించారు. జులై 13న విడుద‌లైంది ఈ చిత్రం. అక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. బెంగాలిలో టాప్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది ఈ ఫిదా. గ‌తంలో య‌శ్ దాస్ గుప్తా నేను లోక‌ల్.. త‌ని ఒరువ‌న్ సినిమాల‌ను కూడా రీమేక్ చేసాడు. ఇప్పుడు తొలిప్రేమ‌తో వ‌చ్చాడు. మొత్తానికి మ‌న తొలిప్రేమ‌.. బెంగాలి వాళ్ల‌కు ఫిదా అయింద‌న్న‌మాట‌.

User Comments