రామ్‌చ‌ర‌ణ్ ఆరెంజ్‌లాంటి ల‌వ్ స్టోరి

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ సెల‌క్ష‌న్ ఎప్పుడూ క్లాసిక్ గా ఉంటుంది. మెగా నిర్మాత కె.ఎస్.రామారావు అనుభ‌వానికి త‌గ్గ‌ట్టే ఎంపిక‌లు ఉంటాయ‌నడంలో సందేహం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఏ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్న వీడీ 9 టైటిల్ తాజాగా ప్ర‌క‌టించారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనేది టైటిల్.

అయితే ఈ టైటిల్ చూడ‌గానే రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్ త‌ర‌హాలో ఉంటుందా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో న‌లుగురు ముద్దుగుమ్మ‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ్ లో ప‌డతాడు. అందుకే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అవుతాడ‌న్న‌మా. అందులో ఇజ‌బెల్లి లాయిటే అనే విదేశీ ల‌వ‌ర్ కూడా ఉంది. రాశీఖ‌న్నా, కేథ‌రిన్ థ్రెసా, ఐశ్వ‌ర్యా రాజేష్ ల‌తో అత‌డి ప్రేమాయ‌ణం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. అంతా బాగానే ఉంది కానీ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేయ‌లేని మ్యాజిక్ క్రాంతి మాధ‌వ్ చేస్తాడా? న‌చ్చిన ప్ర‌తి అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడి క‌థ‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు? అన్న‌ది చూడాలి. గోపి సుంద‌ర్ మ్యూజిక్ కోట‌గిరి ఎడిటింగ్ ప్ర‌తిభ ఈ చిత్రానికి ప్ల‌స్ కానున్నాయి. ఎంచుకున్న‌ది ఆరెంజ్ లాంటి క‌థే అయినా స‌క్సెస్ అందుకోవ‌డంలోనే ఉంటుంది మ‌జా. మ‌రి ఆ ప‌ని చేస్తారా విజ‌య్ – క్రాంతి మాధ‌వ్ జోడీ అన్న‌ది చూడాలి.