వీర రాఘ‌వుని వ‌న్ మ్యాన్ షో

Last Updated on by

ఎన్టీఆర్ న‌టించిన సినిమా `అర‌వింద స‌మేత‌`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. ఈ గురువారం సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్ర‌మిద‌ని యూనిట్ చెబుతోంది.

తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ స‌క్సెస్‌మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ -“ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్ మూవీ ఇది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మాయ చేశాడు. మెగాస్టార్ ఇంద్ర యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ చిత్రం. ఆది, స‌మ‌ర సింహారెడ్డి, న‌ర‌సింహా నాయుడు .. ఇవ‌న్నీ ఫ్యాక్ష‌న్ చిత్రాల్ని మ‌నం చూశాం. ఫ్యాక్ష‌న్ క‌థ‌ని త్రివిక్ర‌మ్ అంత‌ గొప్ప‌గా చూపించారు. న‌టుడిగా ఎన్టీఆర్ వ‌న్ మ్యాన్ షో చూపించారు. జ‌గ‌ప‌తిబాబు అద్భుతంగా న‌టించారు. సినీప‌రిశ్ర‌మ వెయిటింగ్ లో ఉంది మంచి హిట్టు కావాల‌ని. రెండు నెల‌లుగా మంచి సినిమా రాలేదు. ఆ లోటును ఈ సినిమా తీర్చింది“ అన్నారు.

త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ – ఎన్టీఆర్ ఈ క‌థ‌ని న‌మ్మారు. నాకంటే ఎక్కువ న‌మ్మారు. పాట‌లు త‌గ్గుతున్నాయా.. ఎలిమెంట్స్ త‌గ్గుతున్నాయా? అనేది ఆలోచించ‌వ‌ద్ద‌ని జెన్యూన్‌గా క‌థ‌ను చెబుదామ‌ని తార‌క్ ప్రోత్స‌హించారు. అందుకే ఈ విజ‌యానికి కార‌కుడు త‌నే. త‌న‌కే నేను ధ‌న్య‌వాదాలు చెప్పాలి.1950-60ల‌లో క‌థ‌ల్ని ఎలా న‌మ్మి చెప్పేవారో, ఆ మార్పు మ‌ళ్లీ ఇప్పుడు వ‌చ్చింది. ఏడాది కాలంగా ఈ మార్పు క‌నిపిస్తోంది. అర‌వింద కు స‌మీక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్క‌డానికి కార‌ణం క‌థ‌, ఎమోష‌న్. యుద్ధం ముగిశాక అస‌లు ఏం జ‌రుగుతుంది? ఏం క‌థ ఉంటుంది? అన్న పాయింట్‌ని చెప్పాల‌నుకున్నాం. అది రిస్క్ తీసుకుని చేసిన ప్ర‌య‌త్న ం జ‌నాల‌కు అదే న‌చ్చింది. ఈ చిత్రంలో బెస్ట్ యాక్ష‌న్ కి క్రెడిట్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల‌దే. రామ్ ల‌క్ష్మ‌ణ్ స్థాయిని మించారు. వారు ఫైట్ మాష్ట‌ర్లు కాదు. క‌థ‌లో ఒక భాగాన్ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. అది ఇప్పుడు కాదు.. టైమ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నిరూపిస్తున్నారు. ఓ యాక్ష‌న్ క్లైమాక్స్ అనుకుని దానిని డిజైన్ చేసి రీడిజైన్ చేసిన‌ది ఫైట్ మాష్ట‌ర్లు. బ‌సిరెడ్డి అత‌డి కొడుకు అని న‌వీన్ చంద్ర బాగా న‌టించారు అని తెలిపారు.

User Comments