ఆంటీలు ఆడుకున్నారు!

Last Updated on by

న‌లుగురు అంద‌గ‌త్తెలు న‌టించిన వీరే ది వెడ్డింగ్ నేడు థియేట‌ర్ల‌లోకి రిలీజైన సంగతి తెలిసిందే. క‌రీనాక‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్‌, శిఖా త‌ల‌సానియా ప్ర‌ధాన‌పాత్ర‌ధారుల్లో న‌టించిన‌ ఈ సినిమాని స‌మీక్ష‌కులు ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ 3.5 /5 రేటింగుతో వీరే ది వెడ్డింగ్ చిత్రాన్ని స్కైలోకి లేపేశాడు.

క‌రీనాక‌పూర్ న‌ట‌న అద్భుతం. సోన‌మ్ ప్ర‌తి సినిమాకి ఇంప్రూవ్ అవుతోంది. స్వ‌రాభాస్క‌ర్ న‌ట‌న ఎక్స్‌ప్లోజివ్ ! త‌ల‌సానియా స‌హ‌జంగా ఇమిడిపోయి న‌టించింది అంటూ న‌లుగురు భామ‌ల్ని త‌ర‌ణ్‌ ఆకాశానికెత్తేసాడు. ఈ సినిమా వీక్షించిన ప‌లువురు సెలబ్రిటీలు గ్రేట్ మూవీ అంటూ కితాబిచ్చేశారు. పెళ్లి అయ్యాక స‌రిగ‌మ‌ల‌పై ఆస‌క్తిక‌ర చిత్ర‌మిద‌ని ప‌లువురు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఓ బిడ్డ త‌ల్లి అయినా క‌రీనాక‌పూర్ ఈ చిత్రంలో క‌నిపించిన తీరును మెచ్చుకుని తీరాల్సిందే. త‌న ముందు సోన‌మ్ సైతం చిన్న‌బోయింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక‌పోతే ఈ సినిమాకి మీడియా ముఖంగా ఆ న‌లుగురు భామ‌లు చేస్తున్న ప్ర‌చారం మామూలుగా లేదు. భామ‌ల‌ యందు ఆ న‌లుగురు భామ‌లు వేరయా.. బెబో ఆంటీ వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర వేమ‌!

User Comments