Last Updated on by
ఒకటి రెండు కాదు.. ఏడాదిన్నరగా ఖాళీగానే ఉన్నాడు వెంకటేష్. అప్పుడెప్పుడో 2016 నవంబర్ లో గురు సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది విడుదలై ఏడాది అయినా కూడా షూటింగ్ అయి ఏడాదిన్నర అయింది. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ వెంకటేష్ షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఈ హీరో కొత్త సినిమా మొదలు కానుంది. తేజతో ఈయన సినిమా కన్ఫర్మ్ అయి కూడా చాలా రోజులైంది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. మధ్యలో ఓ సారి ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అన్ని అనుమానాలకు తెరదించేస్తూ.. కొత్త లుక్ విడుదలైంది. భుజానికి బ్యాగ్.. చేతిలో బుక్స్.. కళ్లజోడు ఇవన్నీ చూస్తుంటే ముందు నుంచి ఊహించినట్లే వెంకటేష్ ఇందులో ప్రొఫెసర్ గా నటిస్తున్నాడని అర్థమైపోతుంది.
పాతికేళ్ళ తర్వాత మళ్లీ బుక్ పడుతున్నాడు విక్టరీ హీరో. అప్పట్లో సుందరాకాండ సినిమాలో లెక్చరర్ గా నటించాడు వెంకీ. మళ్లీ ఇన్నాళ్లకు ఈ పని చేస్తున్నాడు. అప్పుడు వర్కౌట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాడు వెంకటేశ్. మరోవైపు తేజ సినిమాలో నారా రోహిత్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఇందులో 60 మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నాడు తేజ. రెండు నెలల్లో షూటింగ్ పూర్తిచేసి జులైలో విడుదల చేయాలని చూస్తున్నాడు తేజ. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆటనాదే వేటనాదే టైటిల్ దీనికి కన్ఫర్మ్ చేసారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ కానున్నాడు తేజ.
User Comments