సీక్రెట్ గా విక్ట‌రీ డాట‌ర్ పెళ్లి!

Last Updated on by

విక్ట‌రీ వెంక‌టేష్ కుమార్తె అశ్ర‌త‌ వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డిగారి మనవడితో జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే నిశ్చితార్ధం కూడా జ‌రిగింది. అయినా అశ్రిత మ‌నువాడే కుర్రాడి ఫోలోలు కూడా బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ద‌గ్గుబాటి ఫ్యామిలీ మీడియా విష‌యంలో ఎంత కేర్ ఫుల్ గా ఉంటుందో తెలిస్తోంది. కోడిగుడ్డు మీద ఈక‌లు పీకే మీడియా అని భావించే! సురేష్ బాబు మొద‌టి నుంచి మీడియా విష‌యంలో అంత జాగ్ర‌త్త‌గా ఉంటార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అయితే ఈవారంలో రాజాస్థాన్ లో వివాహం జ‌ర‌గ‌నుంద‌న్న విష‌యం లీకైంది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్రంమే హాజ‌రు కానున్నారుట‌.

టాలీవుడ్ నుంచి కొద్ది మంది ముఖ్య అతిధిలు మాత్ర‌మే వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. వివాహానికి సంబంధించి ఇప్ప‌టికే ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ అయ్యాయుట‌. అయితే వెడ్డింగ్ లో వెంకీ మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల సంద‌డి మాత్రం త‌ప్ప‌క ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే నాగార్జున కూడా వివాహానికి హాజ‌రుకానున్నారుట‌. అమ‌ల అటెండెన్స్ క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఎందుకంటే అదే వేడుక‌కు నాగార్జున మొద‌టి భార్చ , చైత‌న్య త‌ల్లి కూడా హజ‌రుకానున్నార‌ని రామానాయుడు కాంపౌండ్ వ‌ర్గాల నుంచి తెలిసింది. అందువ‌ల్లే అమ‌ల వెడ్డింగ్ కు దూరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వివాహం అనంత‌రం హైద‌రాబాద్ లో భారీ ఎత్తున రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంద‌ని, ఆ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ స‌హా మీడియాని ఆహ్వానించ‌నున్నార‌ని స‌మాచారం.

User Comments