వెంకీ అంద‌ర్నీ ప‌క్క‌న‌బ‌డేసాడా..?

Last Updated on by

మొన్న‌టి వ‌ర‌కు వాళ్ల‌తో సినిమా చేస్తాడు.. వీళ్ళ‌తో సినిమా చేస్తాడు అంటూ వెంకటేష్ పై చాలా వార్త‌లు వచ్చాయి. తేజ‌తో సినిమా అయితే ముహూర్తం పెట్టుకుని మ‌రీ ఆపేసారు. ఇక ఇప్పుడు వెంకటేష్ చేతిలో ఏ సినిమాలు లేవు.. ఒక్క అనిల్ రావిపూడి ఎఫ్ 2 త‌ప్ప‌. ఈ చిత్రం కూడా జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌బోతుంది. ఈ మేర‌కు అఫీషీయ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఇదే సినిమాలో వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టించ‌నున్నాడు. వెంకీకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా.. వ‌రుణ్ తో రొమాన్స్ చేయ‌డానికి మెహ్రీన్ రెడీ అయింది. గ‌తంలో వెంకటేష్ న‌టించిన మ‌సాలా సినిమాలో వ‌చ్చీ రాని బ‌ట్ల‌ర్ ఇంగ్లీష్ డైలాగులు రాసింది అనిల్ రావిపూడే.

అప్ప‌ట్నుంచే ఈ కుర్రాడిపై పాజిటివ్ ఒపీనియ‌న్ తో ఉన్నాడు వెంకీ. మ‌సాలా ఫ్లాప్ అయినా కూడా ఆ డైలాగులు మాత్రం మంచి హిట్ అయ్యాయి. అప్పుడు ర‌చ‌యిత‌గా వెంకీ మ‌న‌సు దోచిన అనిల్.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా స‌త్తా చూపించ‌డానికి వ‌స్తున్నాడు. అనిల్ రావిపూడి కోసం ఇప్పుడు అంద‌ర్నీ ప‌క్క‌కు నెట్టేసాడు వెంకటేష్. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య ఓ సినిమా అనుకుంటున్నా.. ఇప్పుడు చైతూ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే. దాంతో ఇప్పుడు వెంకటేష్ చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఎఫ్ 2 మాత్ర‌మే. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి వ‌ర‌స‌గా నాలుగో విజ‌యాన్ని అందుకుంటాడో లేదో..?

User Comments