వెంకీమామ‌తో బాబీ.. చైతూ..!

Last Updated on by

ఏడాది త‌ర్వాత కొత్త సినిమాకు కొబ్బ‌రికాయ్ కొట్టాడు బాబీ. జై ల‌వ‌కుశ లాంటి భారీ సినిమా త‌ర్వాత కూడా ఆ క్రెడిట్ వాడుకోవ‌డంలో ఫెయిల్ అయిపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క్రెడిట్ ను అంతా వాడేసుకున్నారు కానీ ఈయ‌న మాత్రం అలాగే ఉండిపోయాడు. మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు ప్రాజెక్టులు అనుకున్నా అవి ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కాయి. ఇక ఇప్పుడు వెంక‌టేశ్, నాగ‌చైత‌న్య హీరోలుగా కొత్త సినిమాకు ముహూర్తం పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. రామానాయుడు స్టూడియోస్ లో జులై 11న వెంకీమామ సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉండ‌బోతుంది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌కుల్.. వెంక‌టేశ్ కు జోడీగా హ్యూమాఖురేషి న‌టించ‌నున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ లో మొద‌లు కానుంది. జై ల‌వ‌కుశ యావ‌రేజ్ గా ఆడినా కూడా ఎందుకో కానీ బాబీకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.. ఈ క్రెడిట్ అంతా కోన‌వెంక‌ట్ ప‌ట్టుకెళ్ళిపోవ‌డంతో మ‌ళ్లీ వేట మొద‌ల‌పెట్టి ఇన్నాళ్ళకు ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించాడు. మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ బాగా న‌డుస్తున్న ఈ టైమ్ లో బాబీకి వెంకీ మామ కీల‌కంగా మారింది. హిట్ వ‌చ్చినా క్యాష్ చేసుకోవ‌డం తెలియ‌ని ఈ ద‌ర్శ‌కుడు.. వెంకీ మామాతో అయినా త‌న కెరీర్ ను గాడిన పెట్టుకుంటాడో లేడో..?

User Comments