బాబీ @ జులై 11..

Last Updated on by

జులై 11కి బాబీకి ఏంటి సంబంధం.. ఆ రోజు ఆయ‌న పుట్టిన‌రోజా ఏంటి అనుకుంటున్నారా..? అంత‌కంటే ఎక్కువే ఇప్పుడు.. ఎందుకంటే అదేరోజు ఆయ‌న ఏడాదిగా క‌ల‌లు కంటోన్న సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. వెంక‌టేశ్, నాగ‌చైత‌న్య హీరోలుగా ఈయ‌న ఓ క‌థ సిద్ధం చేసాడు. వెంకీ మామ టైటిల్ ను కూడా ప‌రిశీలిస్తున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉండ‌బోతుంది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌కుల్.. వెంక‌టేశ్ కు జోడీగా హ్యూమాఖురేషి న‌టించ‌నున్నారు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జులైలోనే మొద‌లు కానుంది. జై ల‌వ‌కుశ యావ‌రేజ్ గా ఆడినా కూడా ఎందుకో కానీ బాబీకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.. ఈ చిత్ర క్రెడిట్ అంతా కోన‌వెంక‌ట్ ప‌ట్టుకెళ్ళిపోవ‌డంతో మ‌ళ్లీ వేట మొద‌లుపెట్టాడు బాబీ. ఇన్నాళ్ళూ వేచి చూసి చూసి ఇప్పుడు ఆ సినిమా మొద‌లుపెడుతున్నాడు. మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ బాగా న‌డుస్తున్న ఈ టైమ్ లో బాబీకి వెంకీ మామ కీల‌కంగా మారింది. హిట్ వ‌చ్చినా క్యాష్ చేసుకోవ‌డం తెలియ‌ని ఈ ద‌ర్శ‌కుడు.. వెంకీ మామాతో అయినా త‌న కెరీర్ ను గాడిన పెట్టుకుంటాడో లేదో..?

User Comments