సూర్య- వెంకీ మ‌ల్టీస్టార‌ర్‌

Last Updated on by

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ల జోరు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మూడో జ‌న‌రేష‌న్ న‌టుల్లో ఈ ట్రెండ్‌కు ఆద్యుడు మాత్రం విక్ట‌రీ వెంక‌టేష్‌. అత‌డు మ‌హేష్‌తో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లిసి గోపాల గోపాల‌, రామ్‌తో క‌లిసి మ‌సాలా వంటి మ‌ల్టీస్టార‌ర్ల‌లో న‌టించాడు. ఈ ట్రెండ్‌ని వెంకీ ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నాడు.

ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎప్‌2` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్ అనే ఉప‌శీర్షిక‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇటీవ‌లే లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ చిత్రంలో న‌టిస్తున్నాడు. రెండు సినిమాల సెట్స్‌కి అటూ ఇటూ ప‌రిగెత్తే స‌న్నివేశం ఉందిప్పుడు. అటుపై క్రేజీగా త‌మిళ హీరో సూర్య‌తో క‌లిసి వేరొక మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసింది. వెంకీ- సూర్య మ‌ల్టీస్టార‌ర్‌గా చెబుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే సూర్య‌కు ఇంకా క‌థ వినిపించారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

User Comments