ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ బ‌య‌ట‌ప‌డింది..

Last Updated on by

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఈ త‌రం ద‌ర్శ‌కులు క్రేజీ కాంబినేష‌న్స్ కు తెర‌తీస్తున్నారు. స్టార్ హీరోల‌ను క‌లిపి కూడా ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ మ‌ల్టీస్టార‌ర్స్ కు తెర లేపుతున్నారు. క‌థ న‌చ్చితే హీరోలు కూడా ఇగోలు ప‌క్క‌న‌బెట్టేస్తున్నారు. ఇప్పుడు మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కు కూడా తెర లేచింది. అదే ఎఫ్2. ఇన్నాళ్లూ తెర‌వెన‌కే ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు రెక్క‌లొచ్చాయి. వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్న హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ క‌థ‌ను సిద్ధం చేసాడు. దీనికి ఎఫ్2 అనే విచిత్ర‌మైన టైటిల్ కూడా పెట్టాడు. రాజా ది గ్రేట్ టైమ్ లోనే దీన్ని అనౌన్స్ చేసినా.. ఇందులో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై ఇన్నాళ్లూ స‌స్పెన్స్ డ్రామా న‌డిచింది. ఇప్పుడు దీనికి స‌మాధానం వ‌చ్చింది. శ్రీ రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఎఫ్2 సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఎఫ్2 లో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించ‌నున్నారు. ఇది పూర్తిగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. వ‌రుణ్ తేజ్ కు తొలి హిట్ ఇచ్చింది దిల్ రాజే. ఫిదాతో ఆయ‌న కెరీర్ ను మార్చేసాడు. పైగా ఈ మ‌ధ్యే వ‌చ్చిన తొలిప్రేమ సినిమాను కూడా పూర్తిగా త‌నే విడుద‌ల చేసాడు దిల్ రాజు. ఈ నిర్మాత అడిగితే వ‌రుణ్ కాద‌నడం ఉండ‌దు. అందుకే వ‌రుణ్ తేజ్ ఇందులో ఫైన‌ల్ అయిపోయాడు. అనిల్ రావిపూడి చేయ‌బోతున్న ఆ మ‌ల్టీస్టార‌ర్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

User Comments