వెంకీ మామ ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్

మామ అల్లుళ్లు విక్ట‌రీ వెంక‌టేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ వెంకీమామ‌. వెంకీ జెంటిల్మ‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. నాగ చైత‌న్య ఆర్మీ సైనికుడిగా న‌టించారు. పీపుల్స్ మీడియా సంస్థ‌తో క‌లిసి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ట్రైల‌ర్ తోనే సినిమాలో కంటెంట్ ఏమిటో అర్థ‌మైంది. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్.. చైతూ స‌ర‌స‌న‌ రాశీఖ‌న్నా నాయిక‌లుగా న‌టిస్తున్నారు. బాబి ఈ చిత్రాన్ని కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కించారు. వెంకీ బ‌ర్త్ డే కానుక‌గా డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వెంకీమామ చిత్రం అభిమానుల‌ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఫెయిలైంది. మామ‌- అల్లుళ్ల నుంచి క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ ఆశించిన‌ ప్రేక్ష‌కాభిమానులకు నిరాశ త‌ప్ప‌ద‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో యుద్ధ స‌న్నివేశాలు లాజిక్ లేకుండా తేలిపోవ‌డ‌మే కాదు వీటిపై ట్రోలింగ్ ఎదురైనా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదన్న టాక్ వినిపిస్తోంది. వార్ సీన్ల‌తో పాటు.. క‌మర్శియ‌ల్ హంగుల కోసం జోప్పించిన స‌న్నివేశాలు వ‌ర్క‌వుట్ కాలేదు. నాగ‌చైత‌న్య న‌ట‌న‌లో ఏ మాత్రం స్పార్క్ క‌నిపించ‌లేదు. ఇక వెంకీనే సినిమా మొత్తాన్ని వ‌న్ మ్యాన్ షో గా న‌డిపించారు. కొన్ని కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్వించినా చాలా వ‌ర‌కూ సీన్స్ ఆశించినంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అంతిమంగా బాక్సాఫీస్ ఫ‌లితం యావ‌రేజ్ నుంచి బిలో యావ‌రేజ్ గా నిలిచే అవ‌కాశం ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది.