ఇక తెలుగు వాళ్లంద‌రికీ వెంకీమామ‌నే

“ఈ సినిమాలో చైతూకి వెంకీమామ‌ను.. ఇక‌పై నేను అంద‌రికీ వెంకీ మామ‌నే. నేను ఎక్క‌డికి వెళ్లినా వెంకీ మామా అనే పిలుస్తున్నారు“ అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు విక్ట‌రీ వెంక‌టేష్. వెంకీ-నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ బాబు- పీపుల్స్ మీడియా విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుద‌ల‌వుతోంది. తాజాగా ప్రీరిలీజ్ వేడుక‌లో వెంకీ పైవిధంగా స్పందించారు.

ఇక వెంకీ ఈ ఈవెంట్ ఆద్యంతం ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. ఇక అల్లుడి విష‌యంలో వెంకీలో ఉద్వేగాన్ని అస్స‌లు అదుపు చేయ‌లేక‌పోయారంతే. వెంకీ మాట్లాడుతూ..“చైతూ పెర్ఫామెన్స్ చించేశాడు.. ఈ మామ‌కు ఇంత‌కంటే గ‌ర్వం ఇంకేదీ లేదు. దీనిక‌న్నా మామ‌కు ఇంకేం కావాలి“ అంటూ చైని తెగ పొగిడేశారు వెంకీ. ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తీయడం హ్యాపీగా ఉంది. చిత్ర‌బృందం ఎంతో శ్ర‌మించారని వెంక‌టేష్ తెలిపారు. థ‌మ‌న్ సంగీతం ప్ల‌స్ అని అన్నారు.