వెంకీమామ ముందు బిగ్ టార్గెట్

డిసెంబ‌ర్ సీజ‌న్ రిజ‌ల్ట్ నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన హిట్టు ప‌డ‌లేదు. స‌రిగ్గా ఈ టైమ్ లో `వెంకీమామ` చిత్రం అభిమానుల ముందుకు వ‌స్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ‌చైత‌న్య హీరోలుగా బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంకీమామ ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.  పీపుల్స్ మీడియా  విశ్వ‌ప్ర‌సాద్ తో క‌లిసి సురేష్ బాబు ఈ  చిత్రాన్ని నిర్మించాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ-13.75కోట్లు, నైజాం-7.5కోట్లు, సీడెడ్ -5.4కోట్ల మేర బిజినెస్ సాగింది. ఓవ‌ర్సీస్-3కోట్లు, రెస్టాఫ్ ఇండియా 2.75కోట్ల వ‌ర‌కూ ప్రీబిజ్ సాగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 32.4 కోట్ల బిజినెస్ పూర్త‌యింది. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని వ‌సూలు చేయాలంటే ఆరంభ‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవాలి. వెంకీమామ బడ్జెట్ ప‌రంగా విశ్వ‌ప్ర‌సాద్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకున్నార‌న్న మాటా వినిపిస్తోంది కాబ‌ట్టి అది రిక‌వ‌రీ అవ్వాలంటే మామ అల్లుళ్ల‌ జోరు బాక్సాఫీస్ వ‌ద్ద చూపించాల్సి ఉంటుంది.