మామ‌-అల్లుడు వెన‌క్కి త‌గ్గారా?

మామ- అల్లుడు వెన‌క్కి త‌గ్గారా? మెగాస్టార్ తో మ‌న‌కెందుకు పోటీ అని త‌మ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీమామ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుపుకుంటోంది. అన్ని ప‌నులు పూర్తిచేసి అక్టోబ‌ర్ 4న‌రిలీజ్ చేయాల‌ని భావించారు. అయితే అంత‌కు ముందే ఆక్టోబ‌ర్ 2న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి భారీ ఎత్తున వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

బాహుబ‌లి వ‌సూళ్లు టార్గెట్ గా రిలీజ్ చేస్తున్నారు. హిట్ టాక్ తెచ్చుకుంటే మెగాస్టార్ స్పీడ్ ను ఏ హీరో త‌ట్టుకోలేడ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. బాస్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబ‌ర్ 150నే 50, 100 రోజులు ఆడిన సెంట‌ర్లు ఉన్నాయి. అలాంటింది వార్ ఎపిక్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారంటే? స‌ంచ‌ల‌నాలు ఊహించ‌డం క‌ష్టం. అవ‌న్నీ ఆలోచించే వెంకీమామ‌ను నిర్మాత సురేష్ బాబు ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నారుట‌. న‌వంబ‌ర్ లో సినిమా రిలీజ్ చేయాల‌ని కొత్త తేదీ అనుకుంటున్నారుట‌.