మామ సీక్రెట్ రిలీజ్ ముందే లీక్

Venky and Chaitu ( File Photo)

ఖ‌మ్మంలో వెంకీమామ ప్రీరిలీజ్ సంద‌డి తెలిసిందే. ఈనెల 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే వెంకీ-నాగ‌చైత‌న్య‌-డిసురేష్ బాబు బృందం ప్ర‌చారం అద‌ర‌గొడుతున్నారు. ఈ సినిమా విజ‌యంపై టీమ్ ధీమాను క‌న‌బ‌రుస్తున్నా.. దాదాపు 40-50కోట్ల మేర బ‌డ్జెట్ వెచ్చించారు కాబ‌ట్టి అది రికవ‌రీ చేయ‌డ‌మెలా అన్న గంద‌ర‌గోళంలోనూ ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇక ప్రీ రిలీజ్ వేదిక పై వెంకీ మామ ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా గల ట్రైలర్ ని ఫన్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకున్నాయి. పల్లెటూరిలో మామ అల్లుళ్ళ అల్లరి.. అనుబంధం .. ప్రేమ ఇన్ని అంశాల్ని మేళ‌వించారు. చిన్నప్పటి నుండి మామ అల్లుడికి అన్నీ తానై పెంచిన విధానం.. మామ అంటే ప‌డిచ‌చ్చే అల్లుడి వ్య‌వ‌హారం.. ఇవ‌న్నీ ఎమోషన్స్ తో కూడిన ఎలిమెంట్స్ తో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇక ఈ ట్రైల‌ర్ లో చైతూ ఆర్మీలో చేర‌డానికి కార‌ణ‌మేంటి?  ఊళ్లో శ‌త్రువులు ఎవ‌రు?  చైతూ పై కుట్ర చేసిందెవ‌రు? ఇవ‌న్నీ చూపించేయ‌డంతో ఆల్మోస్ట్ వెంకీ మామ క‌థేంటో అర్థ‌మైపోయింది. ఇక ఈ ట్రైల‌ర్ లో పాయ‌ల్ టీచ‌ర‌మ్మ పాత్ర‌లో అదిరే ట్రీటిచ్చింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.