వెంకటేష్ ను ఇబ్బంది పెడుతున్న ఎన్టీఆర్..

అవును.. ఇప్పుడు వెంకటేష్ ను ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అవునా.. వాళ్లిద్ద‌రికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఇక్క‌డ ఎన్టీఆర్ అంటే జూనియ‌ర్ కాదండీ.. సీనియ‌ర్. అవును.. ఆయ‌నే ఇప్పుడు వెంకీని తెగ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. వెంకటేష్ ప్ర‌స్తుతం తేజ‌తో సినిమాకు క‌మిట‌య్యాడు. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంది కూడా. ఆట‌నాదే వేటనాదే అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ అయింది. అంతా సిద్ధం జ‌న‌వ‌రిలోనే షూటింగ్ మొద‌లు పెడ‌దాం అనుకుంటున్న త‌రుణంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ పై తేజ దృష్టి పెట్టాల్సి వ‌చ్చింది. దాంతో వెంకీ సినిమా ప‌క్క‌కెళ్లిపోయింది. జ‌న‌వ‌రి 18న ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ రోజు టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావించాడు హీరో బాల‌కృష్ణ‌. ఇదే ప‌నిపై ఇప్పుడు బిజీగా ఉన్నాడు తేజ‌. ఇప్ప‌టికే టీజ‌ర్ షూటింగ్ అయిపోయింది.

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. తేజ జీవితాన్ని మార్చేసిందిప్పుడు. 15 ఏళ్లుగా హిట్ లేని ఈ ద‌ర్శ‌కుడికి నేనేరాజు నేనేమంత్రి మ‌ళ్లీ ఊపిరి పోసింది. దాంతో ఈ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో త‌న తండ్రి బ‌యోపిక్ ను తీసుకెళ్లి తేజ చేతుల్లో పెట్టాడు బాల‌య్య‌. అస‌లు తేజ ఈ బ‌యోపిక్ ను హ్యాండిల్ చేస్తాడా.. లేదా అనేది టీజ‌ర్ తోనే అర్థ‌మైపోతుంది. జ‌న‌వ‌రి 18న ఈ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని బ్ర‌హ్మ‌తేజ ప్రొడ‌క్ష‌న్స్ లో సాయికొర్ర‌పాటి, విష్ణుఇందూరితో క‌లిసి నిర్మించ‌బోతున్నాడు బాల‌య్య‌. ఈ సినిమాలో పెద్ద‌గా వివాదాలు ఉండ‌వ‌నే వాద‌న వినిపిస్తుంది. దీనికి మార్గ‌ద‌ర్శి బాల‌య్య కాబ‌ట్టి త‌న తండ్రి జీవితానికి సంబంధించిన వివాదాలేవీ బాల‌య్య చిత్రించడానికి అంగీకరించడు అంటున్నారు విశ్లేష‌కులు. పైగా తాను చేసేది చ‌రిత్రే కానీ.. బ‌యోపిక్ కాద‌ని చెప్పాడు బాల‌య్య‌. త‌న తండ్రి ఆశ‌యాల‌ను చూపించ‌డ‌మే ఈ సినిమా ఉద్దేశ్య‌మ‌ని చెప్పాడు బాల‌య్య‌.

ఎన్టీఆర్ చిన్న‌త‌నంలో ఉన్న ప‌రిస్థితులు.. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి హీరోగా మారిన విధానం.. ఆ త‌ర్వాత పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి అవ్వ‌డంతోనే ఈ సినిమా ఎండ్ అవుతుందంటున్నారు. మ‌రోవైపు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో సాగ‌నుంది. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె వ‌చ్చిన త‌ర్వాతే అనూహ్య మార్పులు జ‌రిగాయి. అవ‌న్నీ త‌న బ‌యోపిక్ లో చూపించ‌బోతున్నాడు వ‌ర్మ‌. అదే జ‌రిగితే క‌చ్చితంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో ఓ ప్ర‌ముఖ పొలిటిక‌ల్ లీడ‌ర్ ను విల‌న్ గా చూపించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో నంద‌మూరి వార‌సులు కూడా ఉంటారు. మ‌రి ఈ రెండు బ‌యోపిక్ ల‌లో ఏది ఎక్కువ‌గా ప్రేక్ష‌కులకు రీచ్ అవుతుందో చూడాలి.. గురు శిష్యుల్లో ఎవ‌రు ఎక్కువ‌గా మాయ చేస్తారో చూడాలి.

Follow US 

User Comments