మిస్ట‌ర్ ల‌వంగం వార‌సుడు?

Last Updated on by

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌ధుడు 2 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయని స‌మాచారం. `మ‌న్మ‌ధుడు` చిత్రంలో బ్ర‌హ్మీ పాత్ర మిస్ట‌ర్ ల‌వంగం క‌డుపుబ్బా న‌వ్వించింది. సీక్వెల్ లో బ్రహ్మీ పాత్ర‌కు కొన‌సాగింపు రోల్ ఉంది. అది ఎవ‌రు పోషిస్తారు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే మ‌న్మ‌ధుడు 2లో ఆ పాత్ర‌ను వెన్నెల కిషోర్ కి ఆఫ‌ర్ చేశార‌ని తెలుస్తోంది.

అయితే బ్ర‌హ్మీ అంత క్లాసిక్ గా న‌వ్వులు పూయించ‌గ‌ల‌డా వెన్నెల అన్న‌ది వేచి చూడాలి. నాగార్జున – రాహుల్ ర‌వీంద్ర‌న్ నిర్ణ‌యం క‌రెక్టేనా? బ్ర‌హ్మీ కి వెన్నెల‌ను ఆల్ట‌ర్నేట్ అని తెలుగు ఆడియెన్ భావిస్తున్నారా? అన్న‌ది ఈ సినిమాతో తేల్తుంది. ఆస‌క్తిక‌రంగా బ్ర‌హ్మీ స్ఫూర్తితో వ‌చ్చిన వెన్నెల కిషోర్ టాలీవుడ్ అగ్ర క‌మెడియ‌న్ గా ఎదిగాడు. అయితే బ్ర‌హ్మీని రీప్లేస్ చేసేంతగా వెన్నెల కిషోర్ సీనుందా? అన్న చ‌ర్చా సాగుతోంది. అత‌డి పాత్ర‌ను వైబ్రేంట్ గా చూపించ‌డంలో రాహుల్ ముందు పెనుస‌వాల్ ఉంది. అయితే ఈ చిత్రంలో బ్ర‌హ్మీకి అవ‌కాశం ఇవ్వ‌లేదా? బ్ర‌హ్మీ ఆరోగ్యం బావున్నా ఎందుక‌ని నాగార్జున పిల‌వ‌లేదు? అన్న ముచ్చ‌టా అభిమానుల్లో సాగుతోంది. మ‌న్మ‌ధుడు 2లో మిస్ట‌ర్ ల‌వంగం వార‌సుడిగా వెన్నెల ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా మ‌న్మ‌ధుడు 2లో న‌టించాల్సిందిగా వెన్నెల కిషోర్ త‌న‌కు అక్కినేని కాంపౌండ్ నుంచి అందిన‌ ఆహ్వాన ప‌త్రాన్ని త‌న సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశాడు.

Also Read : Rana Will Be A Busybee In 2019

User Comments