గ‌ర్వంగా ఉంది కోడ‌లా.. థాంక్యూ మామా..

Last Updated on by

ప్ర‌పంచ‌మంతా `రంగ‌స్థ‌లం` న‌టీన‌టుల పెర్ఫామెన్స్ గురించి, బాక్సాఫీస్ రికార్డుల గురించి మాట్లాడుకుంటోంది. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో రామ్‌చ‌ర‌ణ్ రికార్డుల వేట‌ను ప్ర‌త్యేకించి ప్ర‌స్థావిస్తున్నారు. మ‌గ‌ధీర‌ ఈజ్ బ్యాక్‌! అంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోదారి నేటివిటీ, చిట్టిబాబుగా చ‌ర‌ణ్ పెర్ఫామెన్స్‌, రంగ‌మ్మ‌త్త‌గా అనసూయ న‌ట‌న‌, రామ‌ల‌క్ష్మిగా సామ్ అభిన‌యం అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చాయి. చిరంజీవి, ప‌వ‌న్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్ అంత‌టి బ‌డా స్టార్లు ఈ సినిమాలో పెర్ఫామెన్సెస్ గురించి మెచ్చుకున్నారు.

ఇప్పుడు కింగ్ నాగార్జున వంతు. ఆయ‌న నేటి ఉద‌యం ట్వీట్ చేస్తూ..“రామ్‌చ‌ర‌ణ్.. నీ న‌ట‌న అద్భుతంగా ఉంది. పాత్ర‌లో జీవించావు. స‌మంతను చూస్తుంటే ఎంతో గ‌ర్వంగా ఉంది. ఆర్య‌సుక్కూ మ‌న మూలాల్లోకి తీసుకెళ్లే అంద‌మైన సినిమాని తెర‌కెక్కించావ్‌. మైత్రి సంస్థ‌కు పెద్ద శుభాకాంక్ష‌లు“ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా స‌మంత `థాంక్యూ మామా..` అంటూ ట్విట్ట‌ర్‌లో సంతోషం వ్య‌క్తం చేయడం విశేషం. మామ నుంచి ఇలాంటి అరుదైన ప్ర‌శంస ద‌క్కించుకోవ‌డం ఏ కోడ‌లుకు అయినా గ‌ర్వ‌కార‌ణ‌మే.

User Comments