బోనీక‌పూర్ ను ఇంటరాగేషన్ ఎందుకు చేస్తున్నారు?

Last Updated on by

కోట్లాది మంది అభిమానుల ఎదురుచూపులు.. ఆమెను క‌డ‌సారి చూసేందుకు ముంబైకి ప‌య‌నం అవుతున్న సెలెబ్రెటీలు.. ఇప్ప‌టికే శ్రీ‌దేవి మ‌ర‌ణించి రెండు రోజులు.. ఇన్ని జ‌రిగినా కూడా ఇప్ప‌టికీ ముంబైకి ఆమె పార్థివ దేహం రాలేదు. దుబాయ్ రూల్స్ కు శ్రీ‌దేవి ఫ్యాన్స్ బ‌లైపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇప్పుడు అప్పుడు అని టైమ్ చెప్పారు. ఇప్పుడు డెడ్ బాడీ ఎప్పుడొస్తుందో కూడా తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్ వ‌చ్చేసింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌దేవి మ‌ర‌ణంలో ఎలాంటి సందేహాలు లేవు. డెత్ స‌ర్టిఫికేట్ వ‌స్తే తీసుకుని రావ‌డ‌మే కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమెది హార్ట్ ఎటాక్ కాదు.. మ‌ద్యం తాగి బాత్ ట‌బ్ లో జారిప‌డ‌టం వ‌ల్ల చ‌నిపోయింది అని రాసుంది. దాంతో ఇక్క‌డే మొద‌లైంది అస‌లు ఆట‌. కేస్ పూర్తైపోయి.. శ్రీ‌దేవి డెడ్ బాడీ ముంబైకు వ‌స్తుందేమో అనుకునే టైమ్ లో మిస్ట‌రీగా మార‌డంతో ఇప్ప‌ట్లో ఆమె భౌతిక‌కాయాన్ని ఇండియాకు పంప‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేసారు దుబాయ్ పోలీసులు. త‌మ విచార‌ణ ముగిసేవ‌ర‌కు బోనీక‌పూర్ తో పాటు శ్రీ‌దేవి పార్థివ‌దేహం కూడా అక్క‌డే ఉండాల‌ని ఆదేశించారు. దాంతో చేసేదేం లేక ముంబైకి వెళ్లిన సెలెబ్రెటీస్ అంతా అనిల్ క‌పూర్ ఇంట్లో అంద‌ర్నీ ప‌రామ‌ర్శించి వెళ్లిపోతున్నారు. ముంబైకు ఎప్పుడు శ్రీ‌దేవి బాడీ వ‌స్తే అప్పుడు క‌డ‌సారి చూపుల‌కు వ‌చ్చేలా ఉన్నారంతా. ఫిబ్ర‌వ‌రి 27 ఉద‌యం వ‌ర‌కు కూడా అతిలోక‌సుంద‌రి భౌతికకాయం ఇండియాకు రావ‌డం క‌ష్ట‌మే. ఈ కేస్ లో ఇంకా ఎన్ని మ‌లుపులున్నాయో..?

User Comments