బాల‌న్ కు శ్రీ‌దేవి అవార్డ్‌

Last Updated on by

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. క‌ళాబంధు టీఎస్సార్ జీవితంలోనూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డిందిట‌. ఆ మేర‌కు టీఎస్సార్-టీవీ9 అవార్డుల క‌ర్టెన్ రైజ‌ర్ వేడుక‌ల్లో కొన్ని కొత్త సంకేతాల్ని అందించారు డాట‌ర్ పింకీ రెడ్డి. బ‌యోపిక్ ల ట్రెండ్‌లో మునుముందు టీఎస్సార్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తామ‌ని తెలిపారు ఈ స్టార్ డాట‌ర్. ముందుగా టీఎస్సార్ ఆటోబ‌యోగ్ర‌ఫీని రిలీజ్ చేస్తార‌ట‌. ఫిబ్రవరి 17న‌ విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017- 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుతామ‌ని టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నారు.
రజనీకాంత్,  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సూర్య, విక్రమ్ త‌దిత‌ర‌ స్టార్ల‌కు అవార్డులిస్తున్నారు. న‌గ్మా, మీనా జూరీ స‌భ్యులుగానూ ఉన్నారు. రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని క‌ర్టెన్‌రైజ‌ర్ వేడుక‌లో చెప్ప‌డం ఆస‌క్తి రేకెత్తించింది. నా తండ్రికి వేరెవ్వరూ సాటిలేరు. అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని టీఎస్సార్ కుమార్తె పింకీ రెడ్డి వ్యాఖ్యానించారు.

User Comments