12 బ్రాండ్ల‌తో డ‌ర్టీగాళ్‌

Last Updated on by

డ‌ర్టీపిక్చ‌ర్ చిత్రంతో డర్టీగాళ్ ఇమేజ్ తెచ్చుకుంది విద్యాబాల‌న్‌. సిల్క్ స్మిత హావ‌భావాల‌తో కుర్ర‌కారుకు కిర్రెక్కించింది బాల‌న్‌. ఆ త‌ర్వాత మాస్‌లో అద్భుత‌మైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ ఫాలోయింగ్ ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతోంది. అందుకే మాస్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తెర‌కెక్కించాల్సి వ‌స్తే, ముందుగా కార్పొరెట్ ఎంచుకునేది బాల‌న్‌నే.

అలా ఇప్ప‌టికే 12 బ్రాండ్ల‌కు ఈ అమ్మ‌డు ప్ర‌చారం చేస్తోందిట‌. ఇక ఇందులో మెజారిటీ పార్ట్ బ్రాండ్లు రెన్యువ‌ల్స్ చేయించుకున్న‌వే. అంటే బాల‌న్‌కి ఎదురేలేని ఫాలోయింగ్ ఉండ‌డం వ‌ల్ల‌నే ఇలా కాంట్రాక్టుల్ని పొడిగించుకుంటున్నార‌ట‌. అంతేకాదు కేవ‌లం ఈ 10 నెల‌ల్లో బాల‌న్ ఏకంగా 9 బ్రాండ్ల‌కు సంత‌కాలు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. అదంతా అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం బాల‌న్ టూమ‌చ్ స్లిమ్ అయిపోయిందిట‌. ఇందులో ఎన్టీఆర్ భార్యామ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాల‌న్ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం బాల‌య్య లేకుండా సెట్స్‌లో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోందిట‌.

User Comments