నవంబ‌ర్‌లో న‌య‌న్ నిశ్చితార్థం

Last Updated on by

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్-  న‌య‌న‌తార ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. తాజాగా ఈ జంట మ‌రో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ లో నిశ్చితార్ధం చేసుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ఇద్ద‌రూ సీక్రెట్ గా ఎంగేజ మెంట్ చేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. నయ‌న్ చేతికి ఉంగ‌రం తొడిగి ఉంది. దాన్ని చూసే పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దానిపై ఎప్పుడూ జంట స్పందించ‌లేదు. తాజాగా త‌ల్లిందండ్రుల స‌మ‌క్షంలో ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం న‌వంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంద‌ని వినిపిస్తోంది. వ‌ధువ‌రూల ఇరు కుటుంబాల బంధువులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో ఆ ఘ‌ట్టం జ‌రిగితే హ్యాపీగా ఉంటుంద‌నే..త‌ల్లిదండ్రుల కోరికే మేర‌కే అంగీక‌రించిన‌ట్లు లీకులందుతున్నాయి.

ఇక వ‌చ్చే  ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో న‌య‌న్-విఘ్నేష్ ల వ్వ‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లేన‌ని అనిపిస్తోంది. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నేను రౌడీనే సినిమాలో న‌య‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి స్నేహం కుదిరి ప్రేమ‌కు దారి తీసింది. ఇప్పుడు వివాహ బంధంతో ఒక‌ట‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు వృత్తి ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌త తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా సైరా లో చిరుకు జోడీగా న‌య‌న్ న‌టిస్తోంది.

User Comments