విజ‌య్‌-అట్లీతో వైజ‌యంతి?

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌- అట్లీ కాంబినేషన్ అన‌గానే `తేరి`, `మెర్స‌ల్` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు గుర్తుకొస్తాయి. మెర్స‌ల్ సినిమాతో తెలుగులోనూ విజ‌య్‌కి మార్కెట్ పెరిగింది. త‌మిళ్‌, తెలుగు రెండుచోట్లా మెర్స‌ల్ స‌క్సెస్ సాధించింది. ఆ క్ర‌మంలోనే వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ ఆ కాంబోతో సినిమాకి ప్లాన్ చేశారా? అంటే అవుననే నిన్న‌టిరోజున ఆయ‌న చెప్పిన మాట చెబుతోంది.

అట్లీతో ఓ భారీ చిత్రం ఉంటుంద‌ని అశ్వ‌నిద‌త్ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అది ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ జోడీతోనే ఉంటుంద‌ని ఇప్పుడు అంతా భావిస్తున్నారు. అట్లీ ప్ర‌స్తుతం విజ‌య్ కోసం క‌థ రాస్తున్నాడు. విజ‌య్ మ‌రోవైపు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ షూటింగ్ పూర్తి చేసి, అట్లీతో సినిమా కోసం రెడీ అవుతాడుట‌. ఇదే టైమ్‌లో వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ ఈ క్రేజీ కాంబోతో సినిమా తీస్తున్నాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. దీనిపై ద‌త్ మ‌రోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

User Comments