Last Updated on by
గీత గోవిందం, ట్యాక్సీవాలా చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు విజయ్ దేవరకొండ. నటించిన అరడజను సినిమాల్లో రెండు ఫ్లాపులు మినహా అన్నీ విజయం అందుకున్నాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నైజాం మెగాస్టార్ గా ఎదిగి సంచలనాలు సృష్టించాడు. ట్యాక్సీవాలా తర్వాత అతడు నటిస్తున్న తాజా చిత్రం `డియర్ కామ్రేడ్` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేసి ఫైనల్ కాపీని హీరో దేవరకొండకు చూపించారట.
అయితే ఫైనల్ కాపీ చూశాక విజయ్ రిలీజ్ కి అభ్యంతరం చెప్పారని తెలుస్తోంది. కొన్ని సీన్స్ విషయంలో రీషూట్లు అవసరం అని దర్శకుడిని రెక్వస్ట్ చేశారట. ఈ విషయమై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్ని హీరో అభ్యర్థించాడని చెబుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే నెలాఖరున రిలీజ్ చేయాలని భావించారు. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే రీషూట్లకు మరికాస్త సమయం పడుతుంది. అంటే రిలీజ్ తేదీ ఇప్పుడే ప్రకటించలేని సన్నివేశం ఉందనే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో దేవరకొండ కాకినాడ బోయ్ గా.. కాలేజ్ విద్యార్థిగా కనిపించబోతున్నాడు. కమ్యూనిజం భావాలున్న విద్యార్థిగా అతడు కనిపిస్తాడు. రష్మిక మందన తెలంగాణ గాళ్ గా.. క్రికెటర్ గా నటించింది. గీత గోవిందం సక్సెస్ తర్వాత ఈ జోడీ తిరిగి రిపీటవ్వడం ఫ్యాన్స్ కి బ్యూటిఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. రిలీజ్ తేదీ ప్రకటన గురించి అభిమానులు వెయిటింగ్. మైత్రి సంస్థ ఆ వివరాల్ని చెబుతుందేమో చూడాలి.
User Comments