అర్జున్ రెడ్డి వ‌ర్జిన్ అంట‌..!

Last Updated on by

అవునా.. అర్జున్ రెడ్డి వ‌ర్జినా..? అయ్యో మాకీ సంగ‌తే తెలియ‌దే అనుకుంటున్నారా.. ఈ విష‌యం చెప్పింది కూడా విజ‌య్ దేవ‌ర‌కొండే. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమా త‌ర్వాత క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లు చేసే ప‌రుశురామ్ తో సినిమా క‌మిట‌య్యాడు విజ‌య్. గీతాఆర్ట్స్ లో గీతాగోవిందం అంటూ క్లీన్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఛ‌లో బ్యూటీ ర‌ష్మిక‌తో ఇందులో జోడీక‌ట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్ర షూట్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఆగ‌స్ట్ లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇదిలా ఉంటే సినిమా ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి క్లీన్ సినిమా త‌ర్వాత ప‌రుశురామ్ మ‌రోసారి అలాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడ‌ని అనుకున్నారంతా. మొన్న రిలీజైన ఫ‌స్ట్ లుక్ కూడా బాగానే ఉంది.

ఇప్పుడు మాత్రం ఐ యామ్ 25.. స్టిల్ వ‌ర్జిన్ మేడ‌మ్ అంటూ విజ‌య్ హీరోయిన్ కు చెబుతున్న‌ట్లు పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత ప‌రుశురామ్ ఇలాంటి పోస్ట‌ర్ డిజైన్ చేసాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయ‌న స్కూల్ అది కాదు.. ఇలాంటి ఐడియా ఇచ్చింది అదే యూనిట్ లో ఎవ‌రైనా ఉండాలి.. మ‌రీ ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ ఐడియా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే పాజిటివ్ కంటే నెగిటివ్ కు ఎప్పుడూ ప‌వ‌ర్ ఎక్కువే.. ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌గా రీచ్ అవుతుంది. అర్జున్ రెడ్డితో ఇది బాగా అర్థ‌మైంది విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి. అందుకే ఇప్పుడు గీతాగోవిందం కోసం కూడా అలాంటి స్ట్రాట‌జీ అప్లై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఐడియా ఎవ‌రిదైనా గీతాగోవిందం కూడా వ‌ర్జిన్ టాపిక్ తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయిపోయాడు.

User Comments