విజ‌య్ ఇంకోటి మొద‌లుపెట్టాడు..

Last Updated on by

విజ‌య్ అంటే ఇక్క‌డ త‌మిళ హీరో ఏం కాదు.. మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ఎటు పోతుందో తెలియ‌డం లేదు. మొన్నైతే అర్జున్ రెడ్డితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు.. పైగా ఈ చిత్రానికి ఉత్త‌మ న‌టుడిగా ఫిల్మ్ ఫేర్ కూడా గెలుచుకున్నాడు క‌దా.. ఇప్పుడు ఆయ‌న కెరీర్ కి వ‌చ్చిన ముప్పేంటి అనుకుంటున్నారా..? అవును.. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకో తెలియ‌దు విజ‌య్ కెరీర్ ఇప్పుడు డేంజ‌ర్ లో ఉంద‌నే అనిపిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌నోడి నుంచి చాలా ఊహిస్తారు ప్రేక్ష‌కులు. దానికి ఏ మాత్రం త‌గ్గినా కూడా ప్రేక్షకులు నిరాశ ప‌డ‌తారు. ఆల్రెడీ పెళ్లిచూపులు త‌ర్వాత వ‌చ్చిన ద్వార‌క అడ్ర‌స్ లేకుండా పోయింది. ఇక మొన్న అర్జున్ రెడ్డి త‌ర్వాత ఏం మంత్రం చేసావే అంటూ వ‌చ్చి ఎటూ కాకుండా పోయాడు విజ‌య్.

ఈ సినిమా ఫ్లాప్ అయినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు విజ‌య్. కానీ ఇప్ప‌టికే రావాల్సిన ట్యాక్సీవాలా ఇంకా రాలేదు. మే నుంచి ఇప్పుడు కాదు అప్పుడు అంటున్నారు కానీ ఎప్పుడో చెప్ప‌డం లేదు. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తోన్న ట్యాక్సీ వాలా హిట్ట‌వ్వడం ఇప్పుడు విజ‌య్ కు కీల‌కం. ఈ చిత్రంతో పాటు ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తోన్న గీతాగోవిందం కూడా ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నోటా అనే బై లింగువ‌ల్ సినిమా కూడా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మెహ్రీన్ ఇందులో హీరోయిన్. ఇక ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ అంటూ మ‌రో సినిమా మొద‌లుపెట్టాడు విజ‌య్. ఇందులో కూడా ర‌ష్మిక‌తోనే రొమాన్స్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మించ‌నుంది. ఇలా వ‌ర‌స‌గా సినిమాలు మొద‌లుపెట్టి పూర్తి చేస్తున్నాడు కానీ విడుద‌ల మాత్రం చేయ‌ట్లేదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

User Comments