ట్యాక్సీ డ్రైవ‌ర్ క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడు

Last Updated on by

ఈ రోజుల్లో ఓ టీజ‌ర్ వ‌స్తుందంటే క‌థ మొత్తం చెప్పాల‌ని ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. క‌నీసం ఎలా ఉండ‌బోతుందో ఓ చిన్న క్లారిటీ ఇవ్వాలంటున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఇప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కులు మాత్రం త‌మ క్రియేటివిటీకి మ‌రీ ఎక్కువ‌గా ప‌దును పెట్టేస్తున్నారు. అదేమో సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ దీనికి నిద‌ర్శ‌నం. ఈయ‌న రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ట్యాక్సీవాలా సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. మే 18న విడుద‌ల కానుంది ఈ చిత్రం. యువీ క్రియేష‌న్స్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ట్యాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడు విజ‌య్. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌లైంది.. దీన్ని టీజ‌ర్ అనలేం.. ఫ‌స్ట్ గేర్ అని వాళ్లే ఓ పేరు పెట్టారు.

త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ పోస్ట‌ర్ తో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేస్తార‌ని చెప్పారు చిత్ర‌యూనిట్. అయితే ఇప్పుడు విడుద‌లైంది మాత్రం టీజ‌ర్ అనాలో.. పోస్ట‌ర్ అనాలో.. మోష‌న్ పోస్ట‌ర్ అనాలో.. ఏమ‌నాలో వాళ్ల‌కే తెలియాలి. ఖాళీ పోస్ట‌ర్ రిలీజ్ చేసినా పెద్ద‌గా తేడా ఏమీ ఉండేది కాదేమో..? అన‌వ‌స‌రంగా ఇలాంటి టీజ‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల్ని క‌న్ఫ్యూజ్ చేయ‌డం కాక‌పోతే..! ఇది ఎలాంటి జోన‌ర్.. ఎలా ఉండ‌బోతుంది.. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే తేల‌నున్నాయి. ప్ర‌స్తుతానికి తెలిసిన లెక్క‌ల ప్ర‌కారం అయితే మాత్రం ఇది హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ అని. ఇందులో ప్రియాంక జుల్క‌ర్ హీరోయిన్. మొత్తానికి.. అర్జున్ రెడ్డితో ర‌చ్చ చేసిన విజ‌య్.. ట్యాక్సీవాలాతో ఆ జోరు కొన‌సాగిస్తాడో లేదో..?

User Comments