యంగ్ హీరోకు 50కోట్ల బ‌డ్జెట్టా?

Last Updated on by

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో స్కైలోకి లేచాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం యువ‌త‌రంలో అత‌డి క్రేజు అసాధార‌ణంగా ఉంది. ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండా నానీ త‌ర్వాత అంత‌టి ఛ‌రిష్మాతో వెలిగిపోతున్న హీరోగా దేవ‌ర‌కొండ పేరు పాపుల‌రైంది. అత‌డు ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తున్న తీరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ‌పై ఎంత‌వ‌ర‌కూ బ‌డ్జెట్ పెడితే సేఫ్? అన్న‌ది ప్ర‌శ్నిస్తే .. ఇటీవ‌ల అత‌డి రేంజ్ 100 కోట్ల క్ల‌బ్ అని ప్రూవ్ చేసింది గీత గోవిందం. అందుకే ఇప్పుడు అత‌డిపై 50కోట్ల బ‌డ్జెట్ త‌గ్గ‌కుండా పెట్టేందుకు మైత్రి సంస్థ ముందుకు రావ‌డం సంచ‌ల‌న‌మైంది.

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై `హీరో` నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మైత్రి సంస్థ ఏకంగా 50కోట్ల పైగా బ‌డ్జెట్ ని వెచ్చించింద‌న్న‌ది హాట్ టాపిక్. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన `డియ‌ర్ కామ్రేడ్` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ వెంట‌నే ఈ మిడ్ రేంజ్ హీరోతో భారీ సినిమాకి శ్రీ‌కారం చుట్టడం హాట్ టాపిక్ గా మారింది. తాజా చిత్రానికి ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రారంభోత్స‌వంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. దిగంత్ మ‌చాలే, వెన్నెల కిషోర్‌, శ‌ర‌ణ్ శ‌క్తి, రాజా కృష్ణ‌మూర్తి(కిట్టి), జాన్ ఎడ‌త‌ట్టిల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారుమ్యూజిక్‌: ప‌్ర‌దీప్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: ముర‌ళి గోవింద‌రాజులు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ అన్నామ‌లై.