తీవ్ర ఒత్తిడిలో దేవ‌ర‌కొండ‌

Last Updated on by

యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై తీవ్ర ఒత్తిడి నెల‌కొందా? అంటే అవుననే తాజా స‌న్నివేశం చెబుతోంది. తానొక‌టి త‌లిస్తే దైవం ఇంకొక‌టి త‌ల‌చిన‌ది! అన్న చందంగా కేవ‌లం కొద్ది వారాల గ్యాప్‌లోనే అత‌డి సీన్ మారిపోయింది. ఓవైపు `గీత గోవిందం` గ్రాండ్ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లోనే `నోటా` కొట్టిన దెబ్బ‌కు నోటి మాటే రాలేదు. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ కొంత‌కాలంగా ఎవ‌రికీ ట‌చ్‌లో లేడు. క‌నీసం మీడియా ఫోన్ నంబ‌ర్ల‌కు క‌నెక్ట్ కాలేదుట‌. నోటా చిత్రంలో పెట్టుబ‌డులు పెట్టినందునే దేవ‌ర‌కొండ‌పై తీవ్రంగా ఒత్తిడి నెల‌కొంద‌ని తెలుస్తోంది.

దీనికి తోడు అత‌డు న‌టించిన త‌దుప‌రి చిత్రం `ట్యాక్సీవాలా` పూర్తిగా ఆన్‌లైన్‌లో లీకైపోవ‌డంతో అది త‌న‌ని కంగారెత్తిస్తోంది. దానిని ఎలా బ‌య‌ట‌ప‌డేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నాడు. ఈ విష‌యం ఇబ్బంది పెడుతోంద‌ని ఇదివ‌ర‌కూ దేవ‌ర‌కొండ స్వ‌యంగా అన్నాడు. కెరీర్ రిస్కులో ప‌డుతుంద‌న్న మాటా అత‌డి నోట వినిపించింది. ఇక‌పోతే మ‌రోవైపు మైత్రి సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం `డియ‌ర్ కామ్రేడ్` పైనే అత‌డి ఆశ‌ల‌న్నీ. అటుపై మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు ఫేం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగానిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న భారీ చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. నేడు ఈ సినిమా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మ‌వుతోంది. అయితే జ‌యాప‌జ‌యాల్ని స‌మానంగా ఎంజాయ్ చేసేవాళ్లు, ఎదిగినా ఒదిగి ఉండే వాళ్లే ఈ రంగంలో సులువుగా ఎద‌గ‌డం సాధ్యం. మ‌రి యువ‌హీరో దేవ‌ర‌కొండ ఎప్ప‌టిలానే ఒదిగి ఉండి, ఒత్తిళ్ల‌ను దూరం పెట్టి మునుముందు ఇంకా ఇంకా దూసుకెళ‌తాడేమో చూడాలి.

User Comments